iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ కి గేట్లు తెరిచిన కీర్తి! ఆ హీరోతోనే ఫస్ట్ సినిమా..

  • Author ajaykrishna Published - 12:34 PM, Wed - 19 July 23
  • Author ajaykrishna Published - 12:34 PM, Wed - 19 July 23
బాలీవుడ్ కి గేట్లు తెరిచిన కీర్తి! ఆ హీరోతోనే ఫస్ట్ సినిమా..

హీరోయిన్ కీర్తి సురేష్ గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ అవార్డు అందుకొని.. అదే లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. అక్కడినుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఓవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్, మరోవైపు హీరోల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ.. మహానటి తర్వాత కీర్తి కెరీర్ అనుకున్న స్థాయిలో సాగలేదని చెప్పాలి. చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అన్ని బోల్తా కొట్టేశాయి. చేసేదేం లేక కొంచం గ్యాప్ తీసుకొని.. గ్లామర్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. గతేడాది మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ మూవీలో కీర్తి గ్లామర్ బాగా వర్కౌట్ అయ్యింది.

ఆ సినిమా హిట్ అనిపించుకున్నా.. కీర్తి కెరీర్ లో పెద్దగా మార్పు రాలేదు. ఓ రకంగా చెప్పుకోవాలంటే నత్తనడకన సాగుతుందని తెలుస్తోంది. ఎందుకంటే.. దసరా తర్వాత తెలుగులో హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. పైగా ‘భోళా శంకర్’ సినిమాలో మెగాస్టార్ కి చెల్లి రోల్ లో కనిపించబోతుంది. అయితే.. ప్రస్తుతం కీర్తి చేతిలో నాలుగు తమిళ సినిమాలున్నాయి. రీసెంట్ గా మామన్నన్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ.. తనకు స్టార్డమ్ తెచ్చిన తెలుగులోనే కీర్తి కెరీర్ సరిగ్గా లేదు. టాలీవుడ్ బిగ్ స్టార్స్ నుండి కీర్తికి ఆఫర్స్ రావడం లేదట. అందుకే ఇప్పుడు సౌత్ ని వదిలేసి బాలీవుడ్ లో అడుగు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసిందట.

సక్సెస్ ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోవాలంటే.. భాషలో వ్యత్యాసం చూడకూడదు. ఎక్కడినుండి మంచి ఆఫర్ వచ్చినా చేస్తూ పోవాలి. కీర్తి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. తమిళ దర్శకుడు కలిస్ తెరకెక్కించునున్న హిందీ సినిమాలో కీర్తిని ఎంపిక చేశారని సమాచారం. కీర్తి బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎన్నాళ్ళుగానో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. ఎట్టకేలకు వచ్చే ఏడాది తన ఫస్ట్ స్టెప్ వేయబోతుంది. అయితే.. కీర్తి బాలీవుడ్ డెబ్యూ ఏ హీరోతో చేయబోతుందో తెలుసా.. వరుణ్ ధావన్ తో. వరుణ్ ఇటీవలే సమంతతో సిటాడెల్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వెంటనే.. మళ్లీ సౌత్ బ్యూటీ కీర్తితో ఈ సినిమా ఓకే చేశాడు. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాని.. వచ్చే ఏడాది అంటే.. 2024 మే నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కీర్తి బాలీవుడ్ ఎంట్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet