iDreamPost
android-app
ios-app

జ్యోతికను తిట్టిపోసిన కస్తూరీ శంకర్.. కారణమేమిటంటే

  • Published May 04, 2024 | 6:16 PM Updated Updated May 04, 2024 | 6:16 PM

ఇటీవలే తమిళనాడులో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనని జ్యోతికకు తాజాగా మీడియాలో కొన్ని ప్రశ్నలు ఎదురవ్వడంతో వాటికి జ్యోతిక ఇచ్చే ఆన్సర్స్ ప్రస్తుతం ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు జ్యోతిక మాటాలపై నటి కస్తూరి కూడా తాజాగా కౌంటర్ వేసింది.

ఇటీవలే తమిళనాడులో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనని జ్యోతికకు తాజాగా మీడియాలో కొన్ని ప్రశ్నలు ఎదురవ్వడంతో వాటికి జ్యోతిక ఇచ్చే ఆన్సర్స్ ప్రస్తుతం ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు జ్యోతిక మాటాలపై నటి కస్తూరి కూడా తాజాగా కౌంటర్ వేసింది.

  • Published May 04, 2024 | 6:16 PMUpdated May 04, 2024 | 6:16 PM
జ్యోతికను తిట్టిపోసిన కస్తూరీ శంకర్.. కారణమేమిటంటే

నటి కస్తూరీ శంకర్.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు. ఎందుకంటే.. తరుచు ఈమె ఏదో ఒక వివాదంతో తలదూర్చుతూ నెట్టింట వైరల్ అవుతుంటుంది. అలాగే ఆమె మాట్లాలతో నిత్యం ఏదో ఒక విధంగా కాంట్రవర్సీకి గురైవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నెటిజన్స్ తో సైతం విమర్శలకు గురవుతుంది కస్తూరీ. అయిన సరే ఈమె ట్వీట్లు మాత్రం ఆగవు. పైగా అందర్నీ రెచ్చగొట్టేలా ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తూ.. ఎవరో ఒకరిపై మండిపడుతునే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో భార్య, స్టార్ హీరోయిన్ అయిన జ్యోతిక పై కౌంటర్లు వేస్తూ సోషల్ మీడియాలో చెల రేగిపోయింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ అనేది నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవలే తమిళనాడులో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో సామన్యులతో పాటు, సెలబ్రిటీలు కూడా ఓట్లు వేశారు. అలాగే ఈ ఎన్నికల్లో సూర్య, కార్తీ కలిసి మరి ఓట్లు వేశారు. అంతేకాకుండా.. కస్తూరీ కూడా తమిళనాడులోనే ఓటు వేసింది. కానీ, జ్యోతిక మాత్రం ఈ ఎన్నికల్లో ఎక్కడ కనిపించలేదు. కాగా, ఇటీవలే మీడియా ముందుకు వచ్చిన జ్యోతికకు ఈ విషయంపై పలు ప్రశ్నలు ఎదురైయ్యాయి. ఇక అక్కడ వేటు వేయలేదా ఎందుకు వేయలేదు అన్నట్టుగా పలు ప్రశ్నలు అడిగారు. దీనికి బదులుగా జ్యోతిక రకరకాల సమాధానాలు చెప్పింది. పైగా కొన్ని సార్లు మనం ఊర్లో ఉండకపోవచ్చని, మాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉంటుందిని తెలిపారు. అంతేకాకుండా.. నేను కొన్ని సార్లు ఆన్ లైన్ లో ఓట్లు వేశాను. ప్రతీది బయటకు చెప్పుకోముగా అన్నట్టుగా తెలిపింది. అలాగే  ప్రతీ ఏడాది ఓట్లు వేస్తాను అని జ్యోతిక చెప్పడం, దాన్ని మళ్లీ రిపోర్టర్ సరి చేస్తూ మేడమ్ అనడం.. మళ్లీ జ్యోతిక ఓటింగ్ ఐదేళ్లకు ఒకసారి ఉంటుందని చెప్పి సరి చేసుకొంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో కారణంగా జ్యోతిక ప్రస్తుతం ట్రోలింగ్ కు గురవుతుంది. పైగా ఆన్ లైన్లో ఓట్లు వేశారా? ఇది ఎప్పుడు జరిగింది. ఆమెకు ఈ మాత్రం నాలెడ్జ్ కూడా లేదా? అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక జ్యోతిక చెప్పిన సమాధానాల మీద తాజాగా కస్తూరీ సైతం మండిపడింది. మాలాంటి వాళ్లంతా ఎండలో రోజంతా నిలబడి ఓట్లు వేశాం. అలాగే అమెరికా ప్రయాణాలుంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకుని వేరే డేట్లకు మార్చుకున్నామంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతిక మీద వస్తున్న ట్రోలింగ్ అనేది అగాడం లేదు. అయితే నిజానికి జ్యోతిక మీద ఇప్పటి వరకు ఎలాంటి ట్రోలింగ్ రాలేదు. ఎందుకంటే.. ఆమె సహజంగా బయటకు ఎక్కువగా రాదు. అలాగే సోషల్ మీడియాలో అంత బిజిగా, యాక్టివ్ గా కూడా ఉండదు. ఇక అలాంటి జ్యోతిక ఇప్పుడు ట్రోలింగ్స్ గురికావడం ఆశ్చర్యకరం. మరి, జ్యోతిక మాటాలకు కస్తూరి కౌంటర్లు వేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.