iDreamPost
android-app
ios-app

దర్శన్‌కు కోపం ఎక్కువ. అతడు మంచోడు కాదు.. పవిత్రతో రిలేషన్‌పై కస్తూరి ఫైర్

Kasturi Fire On Darshan and Pavithra Gowda Relation.. ప్రియురాలికి అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడన్న కోపంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని కొట్టి చంపాడు కన్నడ స్టార్ నటుడు దర్శన్. ప్రస్తుతం దర్శన్, ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్పందించింద కస్తూరి శంకర్.

Kasturi Fire On Darshan and Pavithra Gowda Relation.. ప్రియురాలికి అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడన్న కోపంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని కొట్టి చంపాడు కన్నడ స్టార్ నటుడు దర్శన్. ప్రస్తుతం దర్శన్, ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్పందించింద కస్తూరి శంకర్.

దర్శన్‌కు కోపం ఎక్కువ. అతడు మంచోడు కాదు.. పవిత్రతో రిలేషన్‌పై కస్తూరి ఫైర్

ప్రియురాలి కోసం అభిమానిని హత్య చేశాడు కన్నడ టాప్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్. శాండిల్ వుడ్‌లో టాప్ నటుడిగా కొనసాగుతూ.. సందేశాత్మక చిత్రాలు తీసి ప్రజలకు మంచి చెప్పే హీరో.. రియల్ లైఫ్ విషయానికి వస్తే విలన్ అయ్యాడు. దర్శన్ అరెస్టు కావడంతో కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాదు… సౌత్ సినీ పరిశ్రమలో చర్చకు దారి తీసింది. ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపుతున్నాడన్న కోపంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని బెంగళూరు పిలిపించి.. ఓ షెడ్డులోకి తీసుకెళ్లి.. దారుణంగా కొట్టడంతోనే చనిపోయినట్లు తేలింది. కాగా, ఈ ఘటనపై ఒకప్పటి నటి కస్తూరి శంకర్ స్పందించింది. దర్శన్ కేసు పై మండిపడటంతో పాటు పవిత్రగౌడతో రిలేషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

నటి కస్తూరి కేవలం నటి మాత్రమే కాదు.. సోషల్ యాక్టివిస్ట్ అన్న సంగతి విదితమే. ఆమె పలు అంశాలపై స్పందిస్తూ ఉంటోంది. ఇండస్ట్రీలో జరుగుతున్న, జరిగిన ఇష్యూలపై తన అభిప్రాయాన్ని వ్యకపరుస్తోంది.  తాజాగా ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఈ విషయంపై మాట్లాడింది.  ‘పవిత్ర, దర్శన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని తెలిసి ఆమెకు రేణుకా స్వామి అసభ్యకరమైన మేసేజ్‌లు పెట్టాడు. వాళ్ల పర్సనల్ లైఫ్ వాళ్లది. సోషల్ మీడియా వల్ల అందరి పర్సనల్ లైఫ్ మన ప్రాపర్టీ అంటూ డిసైడ్ చేస్తారు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీరు చూసుకోరు. అవతల వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో చూసి వాళ్లని జడ్జ్ చేస్తూ.. ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లని హెరాస్ చేస్తున్నారు.  హింసను ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. కానీ చనిపోయిన వ్యక్తి కూడా మంచివాడు కాదు.

అతను పవిత్రను వేధించాడు. అసలు తనకు ఏంటి సంబంధం. తను ఎందుకు అసలు అలాంటి మెసేజ్‌లు పంపాలి?’ అని ప్రశ్నిచింది. పవిత్రతో రిలేషన్‌షిప్‌లో ఉండడం దర్శన్ చేసిన తప్పే. తప్పైతే పోలీసులు, కోర్టు చూసుకోవడానికి ఉన్నాయి. దర్శన్ పర్సనల్ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే తన మొదటి భార్య చూసుకుంటుంది.  అదంతా వాళ్ల పర్సనల్ విషయం. కానీ ఒక సెలబ్రిటీకి మెసేజ్‌లు చేసి వేధించే హక్కు పబ్లిక్‌కు ఎవరు ఇచ్చారు? దర్శన్ విషయంలో అది చాలా దూరం వెళ్లింది. దర్శన్‌ హాట్ టెంపర్ పర్సన్.  తను, తన ఫ్యాన్స్ కలిసి రేణుకా స్వామిని కొట్టి గుణపాఠం నేర్పించాలి అనుకున్నారో ఏమో కానీ తను చనిపోయాడు. కాబట్టి పరిస్థితి చేయి దాటిపోయింది. అన్నింటికి ఒక హద్దుండాలి‘ అని పేర్కొంది.

అదేవిధంగా ఇటీవల డీప్ ఫేక్ వంటి టెక్నాలజీ గురించి మాట్లాడుతూ.. రష్మికకు ఎదురైన అనుభవం గురించి ఆందోళన వ్యక్తం చేసింది కస్తూరి శంకర్.  ఈ ఏఐ టెక్నాలజీతో పని పాట లేని వాళ్లు, డబ్బులు ఖర్చు పెట్టకుండా అసభ్యకరమైన ఫోటోలు చేస్తున్నారు. మీరు ఓ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ కు చేస్తే ఆ చేసినవాడు ఏమయ్యాడో తెలియకుండా మాయం చేస్తారు. కానీ ఫిల్మ్ స్టార్లను ఇలా ఇబ్బందిపెడితే మాత్రం వాళ్లు నోరు మూసుకొని ఊరుకోవాలి. ఇదేం న్యాయం? అలా అని వెళ్లి మనుషులను చంపేయాలి, కొట్టేయాలి అని నేను అనను. కానీ ఎంతవరకు అని తట్టుకోగలుగుతాం? ఎవరికైనా ఏదో ఒక పాయింట్‌లో సహనం పోతుంది కదా అంటూ చెప్పుకొచ్చింది కస్తూరి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి