iDreamPost
android-app
ios-app

‘భజే వాయువేగం’ తొలిరోజు కలెక్షన్స్! మరీ ఇంత దారుణమా?

  • Published Jun 01, 2024 | 1:24 PM Updated Updated Jun 01, 2024 | 1:24 PM

Bhaje Vaayu vegam Movie First Day Collections: కార్తికేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'భజే వాయువేగం'. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజు ఎంత రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

Bhaje Vaayu vegam Movie First Day Collections: కార్తికేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'భజే వాయువేగం'. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజు ఎంత రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

  • Published Jun 01, 2024 | 1:24 PMUpdated Jun 01, 2024 | 1:24 PM
‘భజే వాయువేగం’ తొలిరోజు కలెక్షన్స్! మరీ ఇంత దారుణమా?

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ సరైన హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. తాజాగా ‘భజే వాయువేగం’ అంటూ యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈసారి కూడా ఈ యంగ్ హీరోకు నిరాశే ఎదురైంది. అద్భుతమైన యాక్షన్స్ సీన్స్, కార్తికేయ నటన, స్క్రీన్ ప్లే బాగున్నపట్పికీ.. ఎందుకో తెలీదు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. అతడి కెరీర్ లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ రాబట్టాడు కార్తికేయ. ఇంతకీ భజే వాయువేగం డే వన్ కలెక్షన్స్ ఎంతంటే?

‘భజే వాయువేగం’ తండ్రి ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ మాఫియా గ్యాంగ్ తో ఓ యువకుడు సాగించే పోరాటమే ఈ చిత్రం. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కించాడు. దర్శకుడిగా అతడికి ఇది తొలి చిత్రమే అయినప్పటికీ.. అద్బుతమైన టేకింగ్ తో ప్రశంసలు పొంది.. మంచి మార్కులు కొట్టేశాడు. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా ఓపెనింగ్స్ ను రాబట్టింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటకీ.. భారీ ఓపెనింగ్స్ సాధించలేకపోయింది.

Bhaje Vaayu Vegam 1st day collections

ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. భజే వాయువేగం తొలిరోజు రూ. 50 లక్షల  లోపే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ను కార్తికేయ ఊహించి ఉండడు. కానీ వీకెండ్ ఉండటంతో.. కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో కలిపి రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా లాభాల్లోకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి కార్తికేయ సాధించిన తొలిరోజు సాధించిన కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss