iDreamPost
android-app
ios-app

Jr NTR-Karthi: యంగ్ టైగర్ తో పోటీకి సై అంటున్న కార్తీ! 

  • Published Jul 18, 2024 | 12:18 PM Updated Updated Jul 18, 2024 | 12:18 PM

ఊహించని విధంగా దేవరను ఢీ కొట్టడానికి సై అంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మరి ఆ వివరాలు  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఊహించని విధంగా దేవరను ఢీ కొట్టడానికి సై అంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మరి ఆ వివరాలు  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 18, 2024 | 12:18 PMUpdated Jul 18, 2024 | 12:18 PM
Jr NTR-Karthi: యంగ్ టైగర్ తో పోటీకి సై అంటున్న కార్తీ! 

‘దేవర’ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ఈ మూవీ వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అందుకు తగ్గట్లుగానే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. అయితే ఇప్పటిదాక దేవర సోలోగానే రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా దేవరను ఢీ కొట్టడానికి సై అంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మరి ఆ వివరాలు  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. మెుదట అనుకున్న దానికంటే రెండు వారాల ముందుగానే మూవీ థియేర్లలోకి రానుండటంతో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో దేవర విడుదల కానుంది. ఇప్పటికే హిందీ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు సింగిల్ స్క్రీన్లను బ్లాక్ చేయడం మెుదలుపెట్టారు. తెలుగులో కూడా బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకు దేవర సోలో రిలీజ్ అవుతుందని, దాంతో భారీ ఓపెనింగ్స్ ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని విధంగా పోటీలోకి వచ్చాడు కార్తీ.

Devara

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పోటీ పడేందుకు సై అంటున్నాడు కార్తీ. ’96’ మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘మెయ్యజగన్’ సినిమాను సెప్టెంబర్ 27న అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులోనూ దేవరకు సమాంతరంగా విడుదల అవుతుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే తెలుగులో దేవరకు ఎలాంటి ఇబ్బంది రాదు. కానీ తమిళంలో మాత్రం ఎన్టీఆర్ కు గట్టిపోటీ ఇవ్వనున్నాడు కార్తీ. దాంతో అక్కడ భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన దేవర టీమ్ కు సమస్యలు తప్పవనే చెప్పాలి. ‘మెయ్యజగన్’ మూవీలో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విలేజ్ డ్రామాలో శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş