iDreamPost
android-app
ios-app

OTTలో ‘జపాన్’ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Nov 24, 2023 | 12:33 PM Updated Updated Nov 24, 2023 | 12:33 PM

తమిళ, తెలుగు ఇండస్ట్రీలో హీరో సూర్య అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. ఆయన తమ్ముడు కార్తీ సైతం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పలు సినిమా ఈవెంట్స్ లో అచ్చ తెలుగు మాట్లాడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు కార్తీ.

తమిళ, తెలుగు ఇండస్ట్రీలో హీరో సూర్య అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. ఆయన తమ్ముడు కార్తీ సైతం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పలు సినిమా ఈవెంట్స్ లో అచ్చ తెలుగు మాట్లాడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు కార్తీ.

  • Published Nov 24, 2023 | 12:33 PMUpdated Nov 24, 2023 | 12:33 PM
OTTలో ‘జపాన్’ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తమిళంలోనే కాదు.. తెలుగు లో కూడా కార్తీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కార్తీ నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ చేస్తుంటారు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు కార్తీ. ఇటీవల జపాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. ప్రముఖ దర్శకుడు రాజు మురుగన్ దర్శకత్వంలో వహించిన ‘జపాన్’మూవీలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించింది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.. కానీ సినిమా మాత్రం నిరాశ మిగిల్చిది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘జపాన్’ మూవీ నవంబర్ 10న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రానికి పెద్ద ఎత్తున హైప్ ఇచ్చినప్పటికీ ప్రేక్షకులకు అనుకున్నంతగా కనెక్ట్ కాలేదు. జపాన్ మూవీలో కార్తీ డిఫరెంట్ లుక్, విచిత్రమైన యాస మాట్లాడుతూ అద్భుతంగా నటించాడు. కార్తీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.. కానీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జపాన్ మూవీ డిసెంబర్ 1న లేదా 8న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ చేయబోతున్నారట.. కాకపోతే ఈ రిలీజ్ డేట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ మూవీలో మరో ముఖ్యపాత్రల్లో సునీల్, విజయ్ మిల్టన్ నటించారు. సాధారణంగా థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న చాలా చిత్రాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో దుమ్మురేపుతుంటాయి. మరి కార్తీ హీరోగా నటించిన జపాన్ ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.