iDreamPost
android-app
ios-app

Jr NTR-Karthi: కార్తి ఇంత రిస్క్ అవసరమా? దేవర ముందు నిలుస్తాడా?

  • Published Sep 14, 2024 | 11:40 AM Updated Updated Sep 14, 2024 | 11:40 AM

Karthi, Sathyam Sundaram Movie, Devara Movie, Jr NTR: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి రిస్క్ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం మూవీతో ఏకంగా దేవరనే ఢీ కొట్టబోతున్నాడు. దాంతో తారక్ ముందు కార్తి నిలుస్తాడా? అంటూ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Karthi, Sathyam Sundaram Movie, Devara Movie, Jr NTR: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి రిస్క్ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం మూవీతో ఏకంగా దేవరనే ఢీ కొట్టబోతున్నాడు. దాంతో తారక్ ముందు కార్తి నిలుస్తాడా? అంటూ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

  • Published Sep 14, 2024 | 11:40 AMUpdated Sep 14, 2024 | 11:40 AM
Jr NTR-Karthi: కార్తి ఇంత రిస్క్ అవసరమా? దేవర ముందు నిలుస్తాడా?

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటే.. ఆ డేట్ దరిదాపుల్లోకి కూడా చిన్న సినిమాలు వెళ్లవు. అయితే మరో పెద్ద హీరో అయితే ఢీ అంటే ఢీ అంటూ అదే తేదీకి రావడానికి రెడీ అవుతారు. ఇలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే ఓ పెద్ద హీరో ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ.. మరో సినిమా అదే టైమ్ కు వస్తుంటే మాత్రం ఆ హీరో రిస్క్ చేస్తున్నాడా? అంటూ సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కూడా ప్రస్తుతం ఇలాంటి రిస్కే చేస్తున్నాడు. ‘సత్యం సుందరం’ మూవీతో ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే ఢీ కొట్టడానికి రెడీ అయిపోయాడు.

కార్తి.. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే తన యాక్టింగ్ తో  తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. కార్తి మూవీస్ పాజిటీవ్ టాక్ వస్తే.. టాలీవుడ్ లో కూడా కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రస్తుతం ‘సత్యం సుందరం’ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. ’96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అరవింద్ స్వామి, కార్తి లీడ్ రోల్స్ లో నటించారు. అచ్చమైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2డీ బ్యానర్ పై సూర్య , జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక్కడే అసలు సమస్య మెుదలైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెసిందే. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు ఇంకాస్త ఎక్కువైయ్యాయనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో సత్యం సుందరం లాంటి డీసెంట్ మూవీతో కార్తి రావడం రిస్క్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కార్తికి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. దేవర ఫీవర్ తో ఆల్ ఓవర్ ఇండియా ఊగుతోంది. దాంతో దేవర ముందు కార్తి నిలుస్తాడా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కార్తితో పాటుగా మేకర్స్ ఈ రిస్క్ తీసుకోవడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తమిళ్ లో అదే డేట్ కు రిలీజ్ చేసుకుని, దేవర రిలీజ్ అయిన వారం తర్వాత తెలుగులో విడుదల చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. అప్పుడు వసూళ్లు కూడా మంచిగా వస్తాయన్నది వారి వాదన. అయితే తమ కథపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ దేవర ఉన్నప్పటికీ.. రిలీజ్ కు సిద్ధమైయ్యారని తెలుస్తోంది. చూడాలి మరి దేవర ప్రభంజనం ముందు కార్తి నిలుస్తాడా? లేడా? అని. మరి తారక్ కు పోటీగా కార్తి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss