iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ ఓటిటిలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

  • Author ajaykrishna Published - 08:04 AM, Thu - 7 September 23
  • Author ajaykrishna Published - 08:04 AM, Thu - 7 September 23
డైరెక్ట్ ఓటిటిలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

ఈరోజుల్లో ఓటిటి ప్లాట్ ఫామ్ లకు ఎలాంటి డిమాండ్ ఉందో.. ఓటిటి సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. థియేట్రికల్ గా ఎక్కడ, ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలైనా.. ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోయింది. అందుకే చిన్న వారే కాదు బిగ్గెస్ట్ స్టార్స్ సైతం ఓటిటి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రెగ్యులర్ గా ఓటిటి సినిమాలు, సిరీస్ లు ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు కూడా ఓటిటి సినిమాలను ఫాలో అవుతూనే ఉన్నారు. తాజాగా ఓ క్రేజీ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఓటిటిలకు క్రేజ్ పెరిగాక భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఓటిటి లవర్స్ ని అలరించడానికి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా రెడీ అయిపోయింది. ఓటిటి డెబ్యూ చేస్తూ కరీనా.. తాజాగా ‘జానే జాన్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేసింది. దర్శకుడు సుజయ్ ఘోష్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ వర్మ కీలక పాత్ర పోషించాడు. విజయ్ వర్మ ఎవరో తెలుసు కదా.. హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్. ఇక క్రైమ్ థ్రిల్లర్స్ ని అంచనాలు పెంచుతూ.. జానే జాన్ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. కాగా.. వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 21 నుండి జానే జాన్.. స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. ఈ విషయాన్నీ ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ.. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మరి ట్రైలర్ అయితే ఆసక్తికరంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాలా గ్యాప్ తర్వాత కరీనా మళ్లీ తెరపైకి వచ్చింది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో.. కొత్త అవతారంలో కనిపించబోతుంది కరీనా. మరి క్రైమ్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ జానే జాన్ మూవీ.. ఖచ్చితంగా నచ్చుతుంది అని కరీనా చెప్పుకొచ్చింది. మరి సెప్టెంబర్ 21 నుండి జానే జాన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş