iDreamPost
android-app
ios-app

కనులు కనులు దోచాయంటేలో రీతూ వర్మ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెలుసా?

  • Published Aug 24, 2024 | 12:48 PM Updated Updated Aug 24, 2024 | 12:51 PM

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కనులు కనులు దోచాయంటే మూవీ గుర్తుందా. ఇందులో ఇద్దరు కిలేడీ లేడీలు.. హీరోలకు ఝలక్ ఇస్తారు. ఇందులో రీతూ వర్మ ఫ్రెండ్ గా నటించిందోమ్మాయి. ఆమె ఎవరో? బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కనులు కనులు దోచాయంటే మూవీ గుర్తుందా. ఇందులో ఇద్దరు కిలేడీ లేడీలు.. హీరోలకు ఝలక్ ఇస్తారు. ఇందులో రీతూ వర్మ ఫ్రెండ్ గా నటించిందోమ్మాయి. ఆమె ఎవరో? బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

  • Published Aug 24, 2024 | 12:48 PMUpdated Aug 24, 2024 | 12:51 PM
కనులు కనులు దోచాయంటేలో రీతూ వర్మ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెలుసా?

తండ్రిలాగానే వర్సటాలిటీ కోసం తాపత్రయ పడుతున్న నటుడు దుల్కర్ సల్మాన్. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ తనయుడు.. అనతి కాలంలోనే పాన్ ఇండియన్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి కాస్త లేటుగా (పెళ్లి చేసుకున్నాక వచ్చాడు) అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు అన్ని భాషల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఆయన నటించిన చిత్రాల్లో ఒకటి.. కన్నుమ్‌ కన్నుమ్‌ కొళ్లయడిత్తా. తెలుగులో కనులు కనులు దోచాయంటేగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో కేఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్‌ కమలాకర్‌ రెడ్డి, జనార్థన్‌ రెడ్డి, డా.రవికిరణ్ విడుదల చేశారు. దుల్కర్, రక్షణ్ హీరోలుగా నటించగా.. ఈ కిర్రాక్ బాయ్స్ పక్కన కిలాడీ లేడీలుగా కనిపించారు రీతూ వర్మ, నిరంజనీ అహతియాన్.

దుల్కర్, రక్షణ్‌నే బురిడి కొట్టించే అమ్మాయిలుగా నటించి మెప్పించారు ఈ ఇద్దరు. ఇందులో రీతూ వర్మకు స్నేహితురాలిగా నటించిన నిరంజనీ అహతియాన్ ఎవరో తెలుసా.? ఆమె ప్రముఖ తమిళ డైరెక్టర్..అగస్త్యన్ కుమార్తె. ఈయన ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. తమిళ్, హిందీలో చిత్రాలను రూపొందించాడు. ఆయన తెలుగులో ఒక్కటంటే ఒక్క చిత్రాన్ని తీశాడు. అదే రవితేజ, సంగీత, వాణి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు. చివరి అమ్మాయే ఈ నిరంజనీ. నటి కాకముందు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ఫ్యాషన్ స్టైలిస్ట్. నళిని శ్రీరామ్ అనే కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్‌తో తన ప్రయత్నాలు స్టార్ట్ చేసింది నిరంజనీ.

kanulu kanulu dochayante pic talk

ఈ నటి కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది దుల్కర్ మూవీతోనే కావడం విశేషం. దుల్కర్, నజ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన వాయు ముడు పెసవం చిత్రంతో ఆమె స్టైలిస్ట్‌గా మారింది. సిగరం తోడు, త్రిష ఇల్లానా నయనతార, కథాకళి, పెన్సిల్, కబాలి, భైరవ, నమ్మ వీటు పిల్లై చిత్రాలకు వర్క్ చేసింది.  బిగ్ స్టార్ చిత్రాలకు పని చేసింది. 2020లో వచ్చిన కనులు కనులుదోచాయంటే మూవీతో అటు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ, ఇటు నటిగానూ చేసింది. ఇందులో రీతు వర్మ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కంప్లీట్ సినిమా కనిపిస్తుంది. ఈమెకు జోడీగా రక్షణ్ కనిపిస్తాడు. ఇదే సమయంలో ఈ మూవీ డైరెక్టర్ దేసింగ్ పెరియస్వామితో ప్రేమలో పడింది నిరంజనీ అహతియాన్. మూవీ విడుదలయ్యాక ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Niranjani Ahathian (@niranjani_ahathian)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet