iDreamPost
android-app
ios-app

కాంతారా 1 ట్రైలర్ రిలీజ్.. ఈసారి కూడా గూస్బంప్స్ పక్కా

  • Published Sep 22, 2025 | 1:30 PM Updated Updated Sep 22, 2025 | 1:30 PM

రిలీజ్ దగ్గరలో ఉంచుకుని ఇంత సైలెంట్ గా టీం ఎందుకు ఉన్నారు. అసలు వీళ్ళ సైలెన్స్ ను ఎలా అర్థంచేసుకోవాలని.. ఇలాంటి రకరకాల ప్రశ్నలు కాంతారా టీం కు ఎదురయ్యాయి. పైగా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటినుంచి కూడా ఈ మూవీ టీం కు ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినాసరే సినిమాను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు.

రిలీజ్ దగ్గరలో ఉంచుకుని ఇంత సైలెంట్ గా టీం ఎందుకు ఉన్నారు. అసలు వీళ్ళ సైలెన్స్ ను ఎలా అర్థంచేసుకోవాలని.. ఇలాంటి రకరకాల ప్రశ్నలు కాంతారా టీం కు ఎదురయ్యాయి. పైగా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటినుంచి కూడా ఈ మూవీ టీం కు ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినాసరే సినిమాను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు.

  • Published Sep 22, 2025 | 1:30 PMUpdated Sep 22, 2025 | 1:30 PM
కాంతారా 1 ట్రైలర్ రిలీజ్.. ఈసారి కూడా గూస్బంప్స్ పక్కా

రిలీజ్ దగ్గరలో ఉంచుకుని ఇంత సైలెంట్ గా టీం ఎందుకు ఉన్నారు. అసలు వీళ్ళ సైలెన్స్ ను ఎలా అర్థంచేసుకోవాలని.. ఇలాంటి రకరకాల ప్రశ్నలు కాంతారా టీం కు ఎదురయ్యాయి. పైగా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటినుంచి కూడా ఈ మూవీ టీం కు ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినాసరే సినిమాను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు రిలీజ్ సమయం దగ్గరపడుతోంది. కానీ టీం నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ లేదు అనుకునే టైం కి.. ఒక్క ట్రైలర్ వదిలి దానితో అందరిని ప్రశ్నలకు చెక్ పెట్టేసారు.

మొదటి పార్ట్ కు ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో. ఇప్పుడు ఈ ప్రిక్వెల్ కు అంతకుమించి రెస్పాన్స్ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పక్కా గూస్బంప్స్ తెప్పించే విధంగా ట్రైలర్ కట్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను గమనిస్తే ఈసారి ఇంకాస్త లోతుగా కథను చెప్పడానికి ప్రయత్నించిన విధంగా అనిపిస్తుంది. సినిమా అంతా అయ్యేలోపు ఈశ్వరుడి విశ్వరూప దర్శనం ఖాయం.ప్రేమ‌, న‌మ్మ‌క ద్రోహం, యుద్ధం.. చివ‌ర్లో ఈశ్వ‌రుడి ద‌ర్శ‌నం ఇలా సినిమా కథ అంతా సాగిపోయేలా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట రిషబ్ శెట్టి మాత్రం ఈసారి ఇంకాస్త ఎక్కువగానే ప్రాణం పెట్టి ఈ సినిమాను రూపొందించాడనిపిస్తుంది.

ఇప్పటికైతే ట్రైలర్ కట్ అదిరిపోయింది. సినిమా మీద అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడ ఓ కొత్త వరల్డ్ ని బిల్డ్ చేసుకుని.. ఆ ప్రపంచానికి ప్రేక్షకులను తీసుకుని వెళ్లడానికి.. అక్టోబర్ 2 న సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సో వంద శాతం డివోషనల్ సినిమానే ఇది. అలాగే యాక్షన్ సిక్వెన్స్ లు కూడా బాగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాంబినేషన్ తో వచ్చిన సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటున్నాయి తెలియనిది కాదు. ఇక మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.