iDreamPost
android-app
ios-app

Kannappa Movie: కన్నప్ప ముందు భారీ సవాల్.. ముందుచూపు లేకపోతే భారీ నష్టమే!

  • Published Jun 19, 2024 | 4:35 PM Updated Updated Jun 19, 2024 | 4:35 PM

మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మూవీ 'కన్నప్ప'. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ముందు ఓ భారీ సవాల్ ఉంది. అదేంటంటే?

మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మూవీ 'కన్నప్ప'. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ముందు ఓ భారీ సవాల్ ఉంది. అదేంటంటే?

  • Published Jun 19, 2024 | 4:35 PMUpdated Jun 19, 2024 | 4:35 PM
Kannappa Movie: కన్నప్ప ముందు భారీ సవాల్.. ముందుచూపు లేకపోతే భారీ నష్టమే!

కన్నప్ప.. మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. ఆ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయంటూ అభిమానులు, సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నాడు మంచు విష్ణు. ఇక ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు లాంటి బిగ్ క్యాస్టింగ్ ఉండటంతో.. సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే.. ఇప్పుడు కన్నప్ప టీమ్ ముందు ఓ భారీ సవాల్ ఉంది. అదేంటంటే?

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో హై విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపోందుతోంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉందంటూ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు మెచ్చుకుంటున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి ఓ భారీ సవాల్ ఎదురౌతోంది. అదేంటంటే? రిలీజ్ డేట్? అవును.. ఏ మూవీకి అయినా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే సమస్య కన్నప్ప టీమ్ ముందుంది.

Kannappa

మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు, ప్రభాస్ లాంటి భారీ క్యాస్టింగ్ తో వస్తున్నప్పుడు సోలో రిలీజ్ డేట్ ఉంటేనే బాగుటుంది.. ఓపెనింగ్స్ కూడా భారీగా ఉంటాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కన్నప్ప డిసెంబర్ లో రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నెలలో పాన్ ఇండియా సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి. పుష్ప 2 డిసెంబర్ 6న వస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైత్యన్య తండేల్ మూవీ, నితిన్ రాబిన్ హుడ్ మూవీలు కూడా ఇదే నెలలో రానున్నాయి.

వీటితో పాటుగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ను కూడా డిసెంబర్ లోనే విడుదల చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం మెుగ్గుచూపుతున్నాడట. ఇక జనవరి 10న చిరంజీవి విశ్వంభర రాబోతోంది. దీంతో గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రాలు తక్కువ గ్యాప్ లో వస్తే.. వాటి మధ్య పోలికలను నెటిజన్లు భూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకే కన్నప్ప మూవీ ఇదంతా గొడవ వద్దనుకుని ఓ మంచి డేట్ చూసుకుని వస్తే బాగుంటుంది అన్నది అభిమానుల కోరిక. ప్రస్తుతం రిలీజ్ డేట్ గురించి కన్నప్ప టీమ్ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet