iDreamPost
android-app
ios-app

కన్నడ నుండి తెలుగులోకి మరో బ్లాక్ బస్టర్! రిలీజ్ ఎప్పుడంటే..

  • Author ajaykrishna Updated - 03:01 PM, Tue - 19 September 23
  • Author ajaykrishna Updated - 03:01 PM, Tue - 19 September 23
కన్నడ నుండి తెలుగులోకి మరో బ్లాక్ బస్టర్! రిలీజ్ ఎప్పుడంటే..

ఇండస్ట్రీలో సినిమాల ఫలితాలు బట్టి.. వేరే భాషలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలా ఇప్పటిదాకా తెలుగు నుండి వేరే భాషలోకి డబ్ అయిన వాటికంటే.. వేరే భాషల సినిమాలు తెలుగులోకి ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ అన్ని తెలుగు డబ్ చేయించి.. థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా అలా చాలా సినిమాలే వచ్చాయి. గతేడాది కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యాక.. నిర్మాత అల్లు అరవింద్ కాంతార సినిమాని తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేశారు. కట్ చేస్తే.. ఆ సినిమా ఊహించని విధంగా జనాల్లోకి వెళ్ళిపోయి.. ఏకంగా రూ. 60 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టింది.

రీసెంట్ గా ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ కన్నడలో సూపర్ హిట్ కాగా.. ఆ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ వారు.. హాస్టల్ బాయ్స్ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా తెలుగులో యూత్ ని ఆకట్టుకొని మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు కాంతార, హాస్టల్ బాయ్స్ బాటలో మరో కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు రిలీజ్ కి రెడీ అవుతోంది. అదే కలివీర. దీన్ని తెలుగులో కలివీరుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కన్నడ కంటెంట్ కి గిరాకీ పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే.. అక్కడ ఏది బ్లాక్ బస్టర్ అయినా.. రీమేక్ చేయకుండా డైరెక్ట్ డబ్ చేయించి రిలీజ్ చేస్తున్నారు. కలివీర కన్నడలో ఇటీవల అనూహ్య విజయం అందుకుంది.

ఆ సినిమా తెలుగులో వస్తుందన్న కొద్దిరోజులకే సినిమా బిజినెస్ జరిగి.. రిలీజ్ కి కూడా సిద్ధమైంది. తెలుగు ఈ సినిమాని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎం. అచ్చిబాబు ఫ్యాన్సీ రేట్ కి హక్కులు కొని రిలీజ్ చేస్తున్నారు. మినిమమ్ గ్యారంటీ మూవీస్ బ్యానర్ లో కలివీరుడు.. సెప్టెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. అవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏకలవ్య హీరోగా నటించాడు. తాజాగా సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ లో యాక్షన్ స్టంట్స్ అయితే గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మరోవైపు వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి. చూడాలి మరి కలివీరుడు ఎలా ఆకట్టుకుంటాడో!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet