iDreamPost
android-app
ios-app

రజనీకాంత్ కూలీ మూవీలో.. ఉపేంద్ర! లోకేశ్ కనగరాజ్ ప్లాన్ అదుర్స్!

  • Published Aug 24, 2024 | 7:06 PM Updated Updated Aug 24, 2024 | 7:12 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు మూవీలతో బిజీ బిజీగా ఉన్నారు. వెట్టయాన్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో మరో స్టార్ ఎంట్రీ ఇచ్చారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు మూవీలతో బిజీ బిజీగా ఉన్నారు. వెట్టయాన్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో మరో స్టార్ ఎంట్రీ ఇచ్చారు.

  • Published Aug 24, 2024 | 7:06 PMUpdated Aug 24, 2024 | 7:12 PM
రజనీకాంత్ కూలీ మూవీలో.. ఉపేంద్ర! లోకేశ్ కనగరాజ్ ప్లాన్ అదుర్స్!

జైలర్ మూవీ హిట్ తర్వాత జోరు పెంచారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ ఏడాది లాల్ సలామ్ అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వెట్టయాన్ మూవీ కంప్లీట్ కాగా, దసరాకు ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫజిల్, మంజు వారియర్, రానా, రితికా సింగ్ వంటి స్టార్ట్ కాస్ట్ నటిస్తున్నారు. ఇది కాకుండా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. అయితే ఇప్పుడు ఇదే మూవీలో మరో స్టార్ట్ నటుడు కూడా యాక్ట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఆ స్టార్ హీరో నటిస్తారని టాక్ నడవగా ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది చిత్ర యూనిట్.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూలీ మూవీలో నటించనున్నారు. వెల్ కమ్ ఆన్ బోర్డ్ అంటూ ఉపేంద్ర సీరియస్ లుక్కులో కనిపించిన ఫోటోను చిత్ర యూనిట్ పంచుకుంది. అందులో రఫ్ లుక్కులో రప్పాడించేందుకు రెడీ అయ్యాడు ఉప్ప్. మరి నెగిటివ్ రోలా లేక ఏదైనా కీలక పాత్రనా అనేది తెలియాల్సి ఉంది. ఉపేంద్ర నటిస్తున్నాడని తెలియడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇద్దరు కలిసి తొలిసారిగా తెరను పంచుకోబోతున్నారు. దీంతో ఉపేంద్ర, రజనీకాంత్ నటిస్తున్న ఈ మూవీకి హైప్ వచ్చేసింది. ఇద్దరు స్టార్ నటులు..అందులోనూ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఒకే సినిమాలో కనిపించడం అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇక బాక్సాఫీసు లెక్కలు మారుతాయంటూ చర్చించుకుంటున్నారు.

ఈ చిత్రంలో సత్యరాజ్, మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  తలైవర్ 171గా మొదలైన ఈ చిత్రానికి కూలీ అనే పేరును ఖరారు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. 2025లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇటు కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ప్రస్తుతం యూఐ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్స్ లో ఉంది. త్రిశూలం అనే మూవీతో పాటు మరో చిత్రం విడుదల కావాల్సి ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet