iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో వరుసగా 3 పాన్ ఇండియా మూవీస్.. హోంబలే సెన్సేషన్!

  • Published Nov 08, 2024 | 5:33 PM Updated Updated Nov 08, 2024 | 5:33 PM

Prabhas Upcoming Movies With Hombale Films : సినిమా అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే సినిమా. ఫ్యూచర్ లో ప్రభాస్ పేరుకు ఇంతకుమించిన క్రేజ్ ఉంటుంది. తాజాగా హోంబలే ప్రభాస్ తో ఓ సెన్సేషన్ న్యూస్ ను అనౌన్స్ చేసింది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Prabhas Upcoming Movies With Hombale Films : సినిమా అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే సినిమా. ఫ్యూచర్ లో ప్రభాస్ పేరుకు ఇంతకుమించిన క్రేజ్ ఉంటుంది. తాజాగా హోంబలే ప్రభాస్ తో ఓ సెన్సేషన్ న్యూస్ ను అనౌన్స్ చేసింది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Nov 08, 2024 | 5:33 PMUpdated Nov 08, 2024 | 5:33 PM
ప్రభాస్ తో వరుసగా 3 పాన్ ఇండియా మూవీస్.. హోంబలే సెన్సేషన్!

అమరేంద్ర బాహుబలి కాదు కాదు భారతీయ బాక్స్ ఆఫీస్ బాహుబలి. అదే మన డార్లింగ్ ప్రభాస్ ఒకే అనాలే కానీ.. ఈ హీరోతో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. వందలు కాదు వేల కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమాకు ఎంత పెట్టినా దానికి డబుల్ తిరిగొస్తుంది. ఈ విషయం ఇప్పటికే డార్లింగ్ ప్రూవ్ చేశాడు. సో ప్రభాస్ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో.. నిమిషం తీరిక లేకుండా బిజీ అయ్యాడు. అటు దర్శకులు , నిర్మాతలు డార్లింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైం లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు చేసే అవకాశం ఒకే ప్రొడక్షన్ హౌస్ కు దక్కింది. అదే కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్. తెలుగు ప్రేక్షకులకు ఈ కన్నడ ప్రొడక్షన్ హౌస్ కొత్తేమి కాదు. కన్నడ హీరో యష్ తో KGF 1,2 , ప్రభాస్ తో సలార్ సినిమాలను తీసి పాన్ ఇండియా హిట్ అందుకున్నారు.

ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో ట్రిపుల్ జాక్ పాట్ కొట్టింది ఈ ప్రొడక్షన్ హౌస్. ప్రభాస్ తో ఒక సినిమా చేస్తేనే అదొక పెద్ద అచీవ్ మెంట్ లా భావిస్తూ ఉంటారు. ఇలాంటి ట్రెండ్ లో ఏకంగా మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకోవడం ఒక అరుదైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. దీని గురించి గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తూనే ఉంది. కానీ తాజాగా హోంబలే ఫిలిమ్స్ దీనిని కన్ఫర్మ్ చేసింది. 2026, 2027, 2028 వరసగా మూడు సంవత్సరాలు డార్లింగ్ తో తమ అనుబంధం ఉంటుందని, సంవత్సరానికి ఒక భారీ గ్రాండియర్ ని చూడొచ్చని అనౌన్స్ చేసింది. సలార్ 2 శౌర్యంగపర్వంతో ప్రభాస్ తో హోంబలే జర్నీ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పేశారు. ఇది సౌత్ లోనే అతి పెద్ద కొలాబరేషన్ గా చెప్పుకోవచ్చు .ఇక సలార్ 2 ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తారు . ఇందులో పెద్ద సస్పెన్స్ ఏమి లేదు. కానీ అందరి అటెన్షన్ ఇప్పుడు మిగిలిన ఇద్దరు దర్శకులు ఎవరా అని. అయితే ఇప్పటివరకు వినిపిస్తున్న దాని ప్రకారం… ఆ ఇద్దరు దర్శకులు ప్రశాంత్ వర్మ , లోకేష్ కనగరాజ్. దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్సుమెంట్ లేకపోయినా.. ప్రాథమిక ఒప్పందం అయితే కుదిరిందట.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈలోగానే ప్రభాస్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా మొత్తానికి ఇదో బ్లాస్టింగ్ సెన్సేషన్ అని చెప్పి తీరాల్సిందే. ఇలాంటి టాప్ బ్యానర్ కి పాన్ ఇండియా స్టార్ ఒకేసారి వరుసగా మూడు కమిట్మెంట్స్ ఇవ్వడం విశేషమే కదా మరి. డార్లింగ్ వరుస సినిమాల లిస్ట్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఎవరేం అనుకున్నా అవునన్నా కాదన్నా ఒకటి మాత్రం నిజం.. ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్ చూపిస్తున్న స్పీడ్.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరికి మంచి ఇన్స్పిరేషన్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet