Somesekhar
రేణుకాస్వామి హత్య కేసులో క్రమంగా అరెస్టులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కేసులో దర్శన్ తో పాటుగా మరో నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
రేణుకాస్వామి హత్య కేసులో క్రమంగా అరెస్టులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కేసులో దర్శన్ తో పాటుగా మరో నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ప్రముఖ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ తో పాటుగా ఆమె ప్రేయసి పవిత్ర గౌడను సైతం ఈ కేసులో అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. రేణుకాస్వామి హత్య కేసులో క్రమంగా అరెస్టులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరో నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు చేరుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కన్నడ టాప్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రదోశ్ అనే మరో నటుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రదోశ్ కన్నడలో పలు చిత్రాల్లో నటించాడు. దర్శన్ తో కలిసి బృందావన, బుల్ బుల్ సినిమాల్లో నటించాడు. అప్పటి నుంచి వీరిద్దరి బాండింగ్ ఏర్పడింది. ఇతడు గతంలో ఓ బీజేపీ మంత్రి వద్ద పనిచేశాడు. కాగా.. రేణుకాస్వామి హత్య తరువాత దర్శన్ ప్రదోశ్ కు రూ. 30 లక్షలు ఇచ్చి.. మ్యాటర్ ను సెటిల్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ కేసులో ఇంకో ముగ్గురు నిందితులు జగదీష్, రవి, రాజు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రేణుకాస్వామి పోస్ట్ మార్టం నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. ప్రైవేట్ భాగాల్లో తీవ్రంగా హింసించారని, శరీరంలో చాలా చోట్ల ఎముకలు విరిగిపోయానని తెలుస్తోంది. ఇక దర్శన్ ను ఉంచిన అన్నపూర్ణేశ్వరీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో 144 నిషేధాజ్ఞలు విధించారు. అలాగే 200 మీటర్ల వరకు కర్ఫ్యూ విధించారు. ఈ నెల 17 వరకు ఇవి అమలులో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శనపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కన్నడ సినిమా వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్ఎం సురేశ్ తెలిపారు.