iDreamPost
android-app
ios-app

జాక్ పాట్ కొట్టిన సూర్య.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరకు’కంగువ’ థియేట్రికల్ రైట్స్!

  • Published Jul 06, 2024 | 2:41 PM Updated Updated Jul 06, 2024 | 2:41 PM

Suriya Kanguva Movie: తమిళ స్టార్ హీరో సూర్య అంటే తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారు. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగు లో డబ్ చేస్తుంటారు. తాజాగా సూర్య నటిస్తున్న ‘కంగువా’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Suriya Kanguva Movie: తమిళ స్టార్ హీరో సూర్య అంటే తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారు. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగు లో డబ్ చేస్తుంటారు. తాజాగా సూర్య నటిస్తున్న ‘కంగువా’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Published Jul 06, 2024 | 2:41 PMUpdated Jul 06, 2024 | 2:41 PM
జాక్ పాట్ కొట్టిన సూర్య.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరకు’కంగువ’ థియేట్రికల్ రైట్స్!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో తమిళ స్టార్ నటుడు శివ కుమార్ తనయుడు సూర్య ఒకరు. 1997లో రిలీజ్ అయిన ‘నెరుక్కు నేర్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2003లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘కాకా కాకా’ మూవితో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాలలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు సూర్య.  సూర్య కెరీర్ లో భారీ బడ్జెట్ గా తెరెక్కుతున్న చిత్రం ‘కంగువా’.  ప్రస్తుతం ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ మొదలు పెట్టారు నిర్మాతలు. ఈ క్రమంలోనే  తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరకు’కంగువ’ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌గా రూపొందుతున్న చిత్రం ‘కంగవా’. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. 2024 లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో సూర్య నటిస్తున్న ‘కంగువా’ మూవీ ఒకటి.  మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ తీసుకుచ్చింది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు శివ మొదటిసారిగా ఫాంటసీ జానర్ ని టచ్ చేయడంతో ఆడియన్స్ కి ఆసక్తి మరింత పెంచింది. ఇటీవల ‘కంగువా’ టీజర్ కట్ చేసిన తీరు సినిమాపై భారీ అంచనాలు పెంచింది. సముద్రాలు, గిరిజన ప్రాంతాల్లో జరిగే యుద్ద క్షేత్రాల నేపథ్యంలో సూర్య, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మధ్య జరిగే భీకర పోరు అద్భతుంగా చూపించారు. విజువల్స్ ఒక కొత్త ప్రపంచానికి తీసుకువెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ మూవీలో సూర్య, బాబీ డియోల్ లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. మేకర్స్ కాస్ట్యూమ్స్, సెట్ డిజైన్ ప్రతి ఒక్క విషయంపై బాగా శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ‘కంగువా’ మూవీ నిర్మాతలు పాన్ ఇండియా వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలో సూర్య కు ఉన్న క్రేజ్ బాగానే వర్క్ ఔట్ అవుతుంది. పలు చర్చలు, బేరసారాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కంగువా థియేట్రికల్ బిజినెస్ పూర్తయినట్లు తెలుస్తుంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థకి కంగువా థియేట్రికల్ రైట్స్ దక్కినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మైండ్ బ్లోయింగ్ ధరకి కంగువా నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో రైట్స్ అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. 25 కోట్ల డీల్ కుదిరినట్లు ఇండస్ట్రీ టాక్. నైజాం ఏరియాలో 15 కోట్లు, ఆంధ్రలో 10 కోట్లకు కంగువా థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. సూర్య గత చిత్రాలతో పోల్చితే ఇది దిమ్మతిరిగే రేటు అంటున్నారు. మొత్తానికి కంగువాతో సూర్య ఇక్కడ జాక్ పాట్ కొట్టినట్లే అంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş