iDreamPost
android-app
ios-app

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న కంగువా

  • Published Mar 21, 2024 | 11:12 AMUpdated Mar 21, 2024 | 12:38 PM

1678 కాలం నాటి గిరిజన యోధుని కథగా కంగువా సినిమా తెరకెక్కిందని అంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఈ యుగానికి వచ్చిన ఆ యోధుడు... ఒక మహిళా శాస్త్రవేత్త సహాయంతో తన ఆశయం నెరవేర్చడానికి చేసే ప్రయాణమే మిగతా సినిమాగా ఉంటుందట. వినడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ కథకు సరైన కథనం తోడైతే ఇక తిరుగుండదనే చెప్పాలి.

కంగువా అనేది తమిళ స్టార్ హీరో సూర్య టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఎపిక్ యాక్షన్ ఫాంటసీ చిత్రం. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై మొదటి నుంచీ మంచి క్రేజ్ ఉంది. సాధారణంగానే ఇలాంటి ఫాంటసీ జానర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో కొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దానికి తోడు కంగువా ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో పాటు తాజాగా విడుదలయిన టీజర్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఖచ్ఛితంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్ అవుతుందనే నమ్మకం ప్రస్తుతం అందరిలోనూ ఉంది. తాజాగా ఈ సినిమాకి సంభందించిన స్టోరీ లైన్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

1678 కాలం నాటి గిరిజన యోధుని కథగా కంగువా సినిమా తెరకెక్కిందని అంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఈ యుగానికి వచ్చిన ఆ యోధుడు… ఒక మహిళా శాస్త్రవేత్త సహాయంతో తన ఆశయం నెరవేర్చడానికి చేసే ప్రయాణమే మిగతా సినిమాగా ఉంటుందట. వినడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ కథకు సరైన కథనం తోడైతే ఇక తిరుగుండదనే చెప్పాలి. ఈ సినిమాలో ఇటీవల యానిమల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తారు. దిషా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Kanguva is coming with an interesting concept

కాగా కంగువా సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో రికార్డ్ ధరకు సొంతం చేసుకుందని ఇటీవల ఒక ప్రచార కార్యక్రమంలో వెల్లడించింది. ఇప్పటి వరకూ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఏడాది లోనే భారతదేశంలోని అన్ని ప్రధాన భాషల్లో భారీ స్థాయిలో కంగువా విడుదల కానుందని టాక్ నడుస్తుంది. మరి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న కంగువా సూర్య కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి