iDreamPost
android-app
ios-app

సందీప్ వంగా ఆఫర్‌ను తిరస్కరించిన కంగనా

  • Published Feb 07, 2024 | 6:09 PM Updated Updated Feb 07, 2024 | 6:09 PM

Kangana Rejected Offer: సాధారణంగా నటీనటులు, దర్శకులపై సెలబ్రెటీలు కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా, బాలీవుడ్ క్వీన్ కంగనా మధ్య మాటల యుద్దం నడుస్తుంది.

Kangana Rejected Offer: సాధారణంగా నటీనటులు, దర్శకులపై సెలబ్రెటీలు కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా, బాలీవుడ్ క్వీన్ కంగనా మధ్య మాటల యుద్దం నడుస్తుంది.

  • Published Feb 07, 2024 | 6:09 PMUpdated Feb 07, 2024 | 6:09 PM
సందీప్ వంగా ఆఫర్‌ను తిరస్కరించిన కంగనా

బాలీవుడ్‌లోకి వెళ్లి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ల లిస్ట్ తీస్తే అందులో రామ్ గోపాల్ వర్మ పేరు ఉంటుంది. తాజాగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ద్వారా హిందీలో అడుగు పెట్టిన సందీప్ రెడ్డి వంగా సినిమాతో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా అగ్రెషన్ చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ తీసిన సందీప్ వంగా సంచలనం సృష్టించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.900 కోట్ల వసూళ్లు సాధించింది.

నటుడిగా, ఒక స్టార్‌గా రణబీర్ కపూర్‌‌‌ను స్క్రీన్ మీద అద్భుతంగా ప్రెజెంట్ చేసి ఆయన ద్వారా అత్యుత్తమ నటనను రాబట్టి తన కెరీర్లోనే కుండా బాలీవుడ్ లో కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమాను ఇచ్చారు వంగా.  ఐతే ఈ సినిమాలో అనేక అంశాల మీద తీవ్ర వివాదాలు కూడా జరిగాయి. బాలీవుడ్ విమర్శకులతో పాటు సెలబ్రెటీలు కూడా ఈ సినిమాను విమర్శించారు. జావెద్ అక్తర్ లాంటి ప్రముఖ రచయితతో పాటు చాలామంది యానిమల్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను వ్యతిరేకించారు. మహిళలను కించ పరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయని యానిమల్ సినిమాను విమర్శించారు. వాళ్ళలో నటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు. ఐతే అందరికీ సందీప్ రెడ్డి వంగా దీటుగానే స్పందించారు. కానీ కంగనా రనౌత్ విషయంలో మాత్రం సందీప్ కొంచెం సున్నితంగానే స్పందించారు.

కంగనా రనౌత్ తన సినిమాను విమర్శించినప్పటికీ, నటిగా ఆమె పైన గౌరవం ఉందని, అవసరం అయితే తన సినిమాలో ఆమెకు ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తానని సందీప్ వంగా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అందుకు కంగనా సంతోషంగా బదులిస్తూనే.. సందీప్ సినిమాలో తాను నటిస్తే అది సందీప్ కే నష్టం అని చెప్పారు. ‘‘సినిమాను విమర్శించడానికి, సమీక్షించడానికి తేడా ఉంది. యానిమల్ సినిమా పై నా రివ్యూను మీరు నవ్వుతూ చెప్పారు. అది మీకు నాపై ఉన్న గౌరవం అయి ఉండొచ్చు. కానీ మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రా ఇవ్వకండి. అలా ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్టులు అవుతారు. అది మీకే ప్రమాదకరం. ఫిలిం ఇండస్ట్రీకి మీరు కావాలి’’ అంటూ సరదాగా స్పందించారు కంగనా రనౌత్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom