iDreamPost
android-app
ios-app

ప్రభాస్ సరసన పాత హీరోయిన్! 15 ఏళ్ళ క్రితం నాటి బ్యూటీ రిపీట్!

మంచు మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. భారీ వ్యయమే కాదూ భారీ కాస్టింగ్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

మంచు మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. భారీ వ్యయమే కాదూ భారీ కాస్టింగ్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

ప్రభాస్ సరసన పాత హీరోయిన్! 15 ఏళ్ళ క్రితం నాటి బ్యూటీ రిపీట్!

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్పతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. కొద్ది రోజుల క్రితమే న్యూజిలాండ్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర యూనిట్. ఇందులో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీని ఎవీఎ ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తగా నిర్మిస్తున్నాయి. ఇందులో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, రాధిక వంటి స్టార్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు. విజువల్ వండర్స్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఈ ఏడాది ఆఖరున రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

అయితే ఇప్పుడో ఇంటస్ట్రింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో శివుడిగా ప్రభాస్ నటిస్తున్నట్లు టాక్ వినిపించగా.. పార్వతి దేవిగా నయతన తార కనిపింబోతున్నట్లు బజ్ నడిచింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేసులో కొత్త పేరు వినిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ సరసన గతంలో నటించిన ఆ బ్యూటీ.. ఇప్పుడు అతడితో మరోసారి జత కట్టబోతుంది. ఆ బ్యూటీ ఎవరంటే..బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఆమెను పార్వతి దేవి క్యారెక్టర్ కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే.. ఈ జంట.. మళ్లీ 15 సంవత్సరాల తర్వాత జతకట్టబోతుంది.  ప్రభాస్- కంగనా రనౌత్ 2009లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ మూవీలో కలిసి నటించిన సంగతి విదితమే.

పరమ శివునికి అపర భక్తుడు కన్నప్ప అన్న సంగతి తెలిసిందే. కాబట్టి.. ప్రభాస్, కంగనా రౌత్ పాత్రలు కీలకం కాబోతున్నాయి. దీని కోసం ప్రభాస్ మూడు రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ప్రభాస్-కంగనాలపై షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్ నటి యాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్.. కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నాడు. సుమారు 150 కోట్ల బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ, మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. మరీ నిజంగా ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా నటిస్తున్నారా.. పార్వతి కంగనానా అనేది తెలియలేదు. కానీ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet