iDreamPost
android-app
ios-app

మహిళల పట్ల మీ వక్రబుద్ది తెలుస్తోంది.. మాజీ ఎంపీపై కంగనా ఫైర్!

  • Author ajaykrishna Published - 08:19 PM, Fri - 27 October 23

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. దసరా సందర్బంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ్ దహనం చేసింది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. కంగనాపై దారుణంగా కామెంట్స్ చేశాడు. అయితే.. తన స్టైల్ లో అతనిపై కౌంటర్ వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. దసరా సందర్బంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ్ దహనం చేసింది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. కంగనాపై దారుణంగా కామెంట్స్ చేశాడు. అయితే.. తన స్టైల్ లో అతనిపై కౌంటర్ వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

  • Author ajaykrishna Published - 08:19 PM, Fri - 27 October 23
మహిళల పట్ల మీ వక్రబుద్ది తెలుస్తోంది.. మాజీ ఎంపీపై కంగనా ఫైర్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఎలాంటి విషయంలోనైనా ఎంత స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంగనా ఏ సినిమా చేసినా.. ఎలాంటి విషయంలో తలదూర్చినా ఖచ్చితంగా ఆ విషయం వివాదాలకు దారి తీసే స్థాయికి వెళ్తుంటాయి. రీసెంట్ గా చంద్రముఖి 2 సినిమాతో అలరించిన ఈ భామ.. దసరా సందర్బంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ్ దహనం చేసిన సంగతి తెలిసిందే. రావణ దహనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కంగనా.. తన చేతుల మీదుగా రావణ్ దిష్టిబొమ్మను దహనం చేసింది. రామ్ లీలా మైదానంలో రావణుడి బొమ్మకు నిప్పు అంటించిన మొదటి మహిళగా కంగనా రికార్డులోకెక్కింది.

ఇదిలా ఉండగా.. ఓ నెటిజన్ కంగనాకు సంబంధించి ఓల్డ్ స్విమ్ సూట్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఈమె కంగనా యేనా? మోడీ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేస్తున్న బాలీవుడ్ లేడీ’ అని రాసుకొచ్చింది. ఆ పోస్ట్ పై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించి.. కంగనాపై దారుణంగా కామెంట్స్ చేశాడు. “కంగనా కోసం ఎస్పిజి సంస్థ ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. రామ్ లీలా మైదానంలో రావణ దహనంకి కంగనాని ఆహ్వానించారంటే ఎంతగా మర్యాద చూపిస్తున్నారో అర్ధమవుతుంది. అదొక రెస్పెక్ట్ లేని సంస్థ” అని రాసుకొచ్చాడు. అయితే.. సుబ్రహ్మణ్య స్వామి పోస్ట్ చూసిన కంగనా.. తన స్టైల్ లో అతనిపై కౌంటర్ వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ కంగనా ఏమని ఫైర్ అయ్యిందంటే.. “పాలిటిక్స్ లోకి రావడానికి నేను శరీరాన్ని అడ్డు పెట్టుకుంటానని అనుకుంటున్నారేమో. నా స్విమ్ సూట్ పిక్ చూసి ఇంత నీచంగా కామెంట్ చేశారంటే.. అక్కడే మీ స్వభావం, మహిళల పట్ల మీ వక్రబుద్ది స్పష్టంగా అర్ధమవుతుంది. నా స్థానంలో ఎవరైనా యువకుడు కనిపిస్తే.. అతని ఫ్యూచర్ లో గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేవారు. కానీ.. నన్ను అన్నట్లుగా అతను కూడా శరీరం వాడుకుంటున్నాడని అనేవారు కాదుగా.. ఇక్కడే మీలో లింగవివక్ష, స్త్రీలపై మీ వక్రబుద్ది తెలుస్తోంది. మహిళలు అంటే కేవలం సె*క్స్ కోసమే కాదు. వాళ్లకు కూడా మగవాళ్ళ లాగా నాయకురాలు కావాలని ఆశలు, అర్హతలు ఉంటాయి” అని ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం కంగనా మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి కంగనా కామెంట్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap