iDreamPost
android-app
ios-app

వీడియో: కంగనాను చంపేస్తామని బెదిరింపు.. 3 రాష్ట్రాల పోలీసుల‌కు ఫిర్యాదు!

  • Published Aug 27, 2024 | 4:40 PM Updated Updated Aug 27, 2024 | 4:40 PM

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రౌనత్ నటించిన సినిమాలు ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె నటించిన ‘ఎమ‌ర్జెన్సీ’ మూవీ పలు వివాదాల్లో పడింది.

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రౌనత్ నటించిన సినిమాలు ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె నటించిన ‘ఎమ‌ర్జెన్సీ’ మూవీ పలు వివాదాల్లో పడింది.

వీడియో: కంగనాను చంపేస్తామని బెదిరింపు.. 3 రాష్ట్రాల పోలీసుల‌కు ఫిర్యాదు!

బాలీవుడ్ నటి కంగనా రౌనత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయ పరంగా పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ నిలుస్తుంటారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మండీ నుంచి గెలిచారు. సాధారణంగా కొన్ని సినిమాలు రిలీజ్‌కి ముందే ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తుంటాయి. తాజాగా కంగనా రౌనత్ నటించిన ‘ఎమ‌ర్జెన్సీ’ మూవీ విడుదలకు ముందే వివాదంలో పడింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. సెప్టెంబర్ 6న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఆమెకు బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రౌనత్ ని హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంగనా నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ ఇందుకు కారణం అని తెలుస్తుంది. ఈ మూవీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించింది కంగనా. ఈ చిత్రం సెప్టంబర్ 6న రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్న సమయంలో ఆమెకు బెదిరింపులు రావడం గమనార్హం. కంగనాను చంపేస్తాం అంటూ కొంద‌రు ఓ వీడియో ద్వారా ఆమెపై బెదిరింపుల‌కు పాల్పపడ్డారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోన తనకు రక్షణ కల్పించాల్సిందిగా మహారాష్ట్ర డీజీపీకి పోస్ట్ చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోలీస్ అధికారులకు కూడా వీడియో ట్యాగ్ చేసింది కంగనా.

Kangana Ranaut

ఈ మధ్యనే మేకర్స్ ‘ఎమర్జెన్సీ’ మూవీకి సంబందించిన టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో కనిపించింది కంగనా. అయితే ఈ మూవీలో ఖలిస్తానీ నేత జర్నెయిల్ సింగ్ భింద్రన్వాలేను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇంధిరాగాంధి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని అన్నారు. భింద్రన్ వాలే ను కొనియాడుతూ విక్కీథామస్ సింగ్ అనే వ్యక్తి బెదిరించారు. అలాగే ఇందిరను హత్య చేసిన బాడీగార్డులు సత్వంత్ సింగ్,బియాంత్ సింగ్ గురించి కూడా ఆ వీడియోలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.