iDreamPost
android-app
ios-app

‘ఓపెన్ హైమర్’ బెడ్ సీన్ పై కంగనా రివ్యూ!

  • Author ajaykrishna Updated - 11:16 AM, Tue - 1 August 23
  • Author ajaykrishna Updated - 11:16 AM, Tue - 1 August 23
‘ఓపెన్ హైమర్’ బెడ్ సీన్ పై కంగనా రివ్యూ!

ఇటీవల విడుదలైన హాలీవుడ్ మూవీస్ లో ‘ఓపెన్ హైమర్’ ఒకటి. వరల్డ్ వైడ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా.. వివాదాలు రేపిన సంగతి తెలిసిందే. పాపులర్ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా.. అమెరికన్ ప్రోమోతెస్ అనే బయోగ్రఫీ ఆధారంగా రూపొందింది. ఇందులో సిలియన్ ముర్ఫి ప్రధాన పాత్రలో నటించాడు. కాగా.. సినిమా పరంగా పాజిటివ్ వచ్చినప్పటికీ.. సినిమాలో ఉన్న బెడ్ సీన్ కారణంగా ఇండియాలో వివాదం చెలరేగింది. ఎందుకంటే.. హీరోహీరోయిన్స్ మధ్య బెడ్ సీన్ జరుగుతున్న సమయంలో భగవద్గీతను వినిపించడమే. పైగా ఆ సీన్ లో హీరోయిన్ కూడా భగవద్గీత చదవడంతో హిందువులు దీన్ని విమర్శించారు.

ఈ సినిమాలో ఆ సన్నివేశం.. పవిత్రమైన భగవద్గీతను అవమానించే విధంగా ఉందని, దాన్ని వెంటనే సినిమా నుండి తొలగించాలని భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా కేంద్ర సమాచార శాఖ కూడా ఒప్పెన్ హైమర్ మేకర్స్ కి.. సీన్ తొలగించకపోతే మూవీని థియేటర్స్ నుండి తీసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఉన్నా.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా మారింది కంగనా రనౌత్. బాలీవుడ్ లో స్టార్ అయిన ఈ భామ.. ఎల్లప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. కొన్నాళ్ళుగా సౌత్ లోను సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది అమ్మడు. అలాంటిది తాజాగా వివాదం రేపిన ‘ఒప్పెన్ హైమర్’ కాంట్రవర్సీ సీన్ పై తన రివ్యూ ఇచ్చింది.

కంగనా ఆ బెడ్ సీన్ గురించి పాజిటివ్ గా చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. “ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా తమ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఆ బెడ్ సీన్ నాకు చాలా నచ్చింది.. నన్ను ఎంతో ఉద్వేగానికి లోనయ్యేలా చేసింది. ఇందులో హీరో యూదు వ్యక్తి కావడంతో హిందూ దేవుళ్లను తన మతపరంగా చూడలేదు. నాకు ఎంతో ఇష్టమైన భగవద్గీత, శ్రీవిష్ణువులను ఇంగ్లీష్ సినిమాలో చూపించినందుకు చాలా సంతోషం. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాలో చేసిన అత్యుత్తమ పని ఇదే. మూవీ వివాదంతో ముగియాలని కోరుకోలేదు. నేను ఇష్టపడే ప్రతిదీ ఇందులో ఉంది. నాకు ఫిజిక్స్, పాలిటిక్స్ చాలా ఇంటరెస్ట్. నాకీ సినిమా ఒక ఎమోషన్ లాంటిది. మన కాలానికి అతి ముఖ్యమైన సినిమా.” అని చెప్పింది కంగనా. ప్రస్తుతం కంగనా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఒప్పెన్ హైమర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss