iDreamPost
android-app
ios-app

నాయకుడు సినిమాలో కమల్ కూతురు గుర్తుందా?.. ఇప్పుడు ఎలా ఉందంటే?

  • Published Jul 10, 2024 | 7:00 AM Updated Updated Jul 10, 2024 | 7:00 AM

కమల్ హాసన్ నాయకుడు సినిమాలో కమల్ కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె ఎలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఈమె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కమల్ హాసన్ నాయకుడు సినిమాలో కమల్ కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె ఎలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఈమె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Jul 10, 2024 | 7:00 AMUpdated Jul 10, 2024 | 7:00 AM
నాయకుడు సినిమాలో కమల్ కూతురు గుర్తుందా?.. ఇప్పుడు ఎలా ఉందంటే?

విశ్వనటుడు కమల్‌హాసన్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అలాగే అతని కెరీర్ లో నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మరి అలాంటి సినిమాల్లో గత 36 క్రితం వచ్చిన ‘నాయగన్’ (తెలుగులో నాయకుడు) సినిమా కూడా ఒకటి. కాగా, అప్పటిలో ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించారు.అలాగే ఈ సినిమాలో నటి శరణ్య కథానాయికగా నటించారు. ఇకపోతే నాయకన్ సినిమా కమల్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాకుండా.. ఈ చిత్రంలోని ఆయన నటనకు ఉత్తమ జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇక నాయగన్ సినిమాలో జనకరాజ్, విజయం ఎంవీ వాసుదేవరావు, ఢిల్లీ గణేష్, తారలు కూడా నటించారు. అయితే వారితో పాటు ఈ సినిమాలో కమల్ కూతురిగా నటి ‘కార్తీక’ కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే ఆ సినిమాలో కార్తీక తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆమె ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

కమల్ హాసన్ నాయకుడు సినిమాలో కమల్ కూతురిగా నటించిన కార్తీక అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా ఆ సినిమాలో కమల్ కూతురిగా నటించిన కార్తీక తన నటనతో ప్రేక్షకులు అందర్నీ బాగా ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత కార్తీక మరి తమిళ్ సినిమాల్లో నటించలేదు. కేవలం మలయాళ సినిమాల్లోనే కొన్నాళ్లు నటించింది. ఇక ఆ తర్వాత కార్తీక 1988లో సునీల్ కుమార్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక వివాహం అయిన మూడేళ్ల తర్వాత అడపాదడపా సినిమాల్లో అలరించిన కార్తీక.. 1991 తర్వాత పూర్తిగా మరి సినిమాల్లో నటించలేదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఆ ఫోటో 2020లోని  కార్తీక తన కుమారుడి పెళ్లిలో దిగిన ఫోటో కావడం గమన్హారం. ఇకపోతే  సోషల్ మీడియాలో కార్తీక యాక్టివ్ గానే ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు  సంబంధించిన లేటెస్ట్ ఫిక్స్ అన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. అయితే ఎంతో అందంగా ఉండే కార్తీక ఇప్పుడు  గుర్తుపట్టాలేనంతగా మారిపోయిందని  నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..  కార్తీక కేరళ తిరువనంతపురంలో జన్మించింది. ఇక ఈమె తండ్రి  మాజీ సర్వీస్ కాంగ్రెస్ నాయకుడు కెప్టెన్ పికెఆర్ నాయర్ కాగా, తల్లి ఒక సాధారణ గృహిణి. ఇక కార్తీకు ఒక సోదిరి ఉంది. ఇకపోతే  మొదట కార్తీక సిని ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా సినీరంగ ప్రవేశం చేసింది. ఈ క్రమంలోనే ఆమె మొదట 1984లో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ఒరు పైన్కిలికథ తో వెండితెరకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత మణిచెప్పు తురన్నప్పోల్ అనే సినిమాలో నటించింది. అలా ఈమె నటనకు గాను వరుస ఆఫర్లు అందుకున్న కార్తీక.. మొత్తం 20 సినిమాల వరకు నటించింది. కాగా, అందులో రెండు తమిళ్ చిత్రాలు ఉండగా, మిగిలినవన్ని మలయాళ చిత్రాలు కావడమే గమన్హారం. ఇలా ఎన్నో చిత్రాల్లో అలరించిన కార్తిక ఇప్పుడు గుర్తుపట్టాలేనంతగా మారిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş