iDreamPost
android-app
ios-app

ప్రభాస్ వైపు కమల్ హాసన్ సీరియస్ లుక్! వైరల్ అవుతున్న వీడియో!

  • Author ajaykrishna Published - 12:35 PM, Fri - 4 August 23
  • Author ajaykrishna Published - 12:35 PM, Fri - 4 August 23
ప్రభాస్ వైపు కమల్ హాసన్ సీరియస్ లుక్! వైరల్ అవుతున్న వీడియో!

ఎంత పెద్ద బిగ్ స్టార్స్ అయినా సినిమా ఈవెంట్స్ లో.. ఇంటర్వ్యూలలో గలగలా మాట్లాడితే ఎంతో బాగుంటుంది. హీరోలు అలా మాట్లాడుతుంటే ఫ్యాన్స్ కి కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. సరే కెరీర్ ఆరంభంలో స్టేజ్ పై, ఇంటర్వ్యూలలో మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డారంటే అది వేరు. కానీ.. పాన్ ఇండియా స్టార్డమ్, వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చాక కూడా స్టేజ్ పై మాట్లాడేందుకు మొహమాటం పడితే.. ఏం బాగుంటుంది చెప్పండి. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ విషయంలో అదే ఫీల్ అవుతున్నారు అభిమానులు. ప్రభాస్ ఏ సినిమా ఈవెంట్ జరిగినా.. పైపైన వీలైనంత తక్కువ మాట్లాడి మైక్ పక్కవాళ్ళకు ఇచ్చేస్తాడు.

బాహుబలి ముందు వరకు కేవలం తెలుగు హీరో కాబట్టి.. అప్పుడు నడిచింది. కానీ.. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్ సినిమాలతో పాటు సలార్, కల్కి సినిమాలతో క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అయినాసరే స్టేజ్ లపై, ఇంటర్నేషనల్ స్టేజ్ ఇంటర్వ్యూలలో మొహమాటం మాత్రం పక్కన పెట్టట్లేదు. ఓవైపు బాక్సాఫీస్ రికార్డులు కొడుతున్నా.. ప్రభాస్ తన ఇంట్రోవర్ట్ ట్యాగ్ మార్చుకోలేకపోతున్నాడు. ఇటీవల ప్రాజెక్ట్ కే టైటిల్ గ్లింప్స్ ని కామిక్ కాన్ వేదికపై లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా లైట్ లైట్ గా మాట్లాడి బిడియంగా కనిపించాడు. ఈసారి అలా మాట్లాడుతూ.. విశ్వనటుడు కమల్ హాసన్ కి కోపం తెప్పించాడు డార్లింగ్.

ఆ వివరాల్లోకి వెళ్తే.. కామికాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ తర్వాత కల్కి టీమ్ హాలీవుడ్ మీడియాతో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో డైరెక్టర్ నాగ్ అశ్విన్, కమల్ హాసన్ లతో పాటు ప్రభాస్ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ప్రభాస్ స్పందిస్తూ.. మైక్ ని తన నోటికి దగ్గర పెట్టుకోకుండా చిన్నగా మాట్లాడేస్తున్నాడు. అది చూసిన కమల్.. ప్రభాస్ వైపు కాస్త సీరియస్ లుక్ ఇచ్చి.. మైక్ సరిగ్గా పట్టుకోమని చెప్పారు. దీంతో అప్పటివరకు మైక్ పట్టుకోవడం మర్చిపోయిన ప్రభాస్.. కమల్ కి ‘సారీ’ చెప్పి మైక్ లో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కల్కి 2898 AD మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet