Aditya N
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇటీవల, ఆడుజీవితం నిర్మాతలు చెన్నైలో ఈ చిత్రం కోసం ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇటీవల, ఆడుజీవితం నిర్మాతలు చెన్నైలో ఈ చిత్రం కోసం ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు.
Aditya N
పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం: ది గోట్ లైఫ్) సినిమాకి విడుదలకు ముందే భారీ ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు. సీనియర్ ఫిల్మ్ మేకర్ బ్లెస్సీ డైరెక్ట్ చేసిన మలయాళ సర్వైవల్ డ్రామా ఆడుజీవితం: ది గోట్ లైఫ్ మార్చి 28, గురువారం థియేటర్లలోకి రానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల, ఆడుజీవితం నిర్మాతలు చెన్నైలో ఈ చిత్రం కోసం ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు, దీనికి కమల్ హాసన్, మణిరత్నం వంటి లెజెండ్స్ తో పాటు మరికొంత మంది హాజరయ్యారు. ప్రివ్యూ షో చూసిన కమల్, పృథ్వీరాజ్ తో పాటు దర్శకుడు బ్లెస్సీకి ఉన్న అభిరుచిని ఒక ప్రత్యేక వీడియోలో ప్రశంసించారు.
ఆడుజీవితంతో బాగా ప్రభావితులైన కమల్ హాసన్ ఆ సినిమాను ప్రశంసిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్శకుడు బ్లెస్సీ, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు సాంకేతిక సిబ్బంది పై కమల్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాన్ని రూపొందించినందుకు బ్లెస్సీకి కృతజ్ఞతలు తెలిపిన కమల్ హాసన్, మణిరత్నం కూడా సినిమా చూసి ఆశ్చర్యపోయారని వెల్లడించారు. ఇంటర్వెల్‌లో సినిమా చూసిన వారికి నీరు తాగాలని అనిపిస్తుందని, ఆ రకమైన ప్రభావం సినిమా చూపిస్తుందని ఆయన వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… స్వతహాగా ప్రయోగాలకు పెట్టింది పేరైన కమల్, బ్లెస్సీతో పాటు ది గోట్ లైఫ్ చిత్ర బృందంలో విభిన్నమైన ప్రయత్నం చేయాలనే పట్టుదల చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పై కమల్ హాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా తన పాత్ర నజీబ్ స్నానం చేసే షాట్ గురించి ప్రస్తావిస్తూ పృథ్వీరాజ్ పాత్ర కోసం ఇంత దూరం వెళ్తాడని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ సునీల్ కెఎస్ పని తీరుని కూడా కమల్ ప్రశంసించారు. కాగా ఒక నటుడిగా, చిత్ర నిర్మాతగా ఇలాంటి చిత్రాన్ని తీయడం ఎంత కష్టమో తనకి అర్థమవుతుందని, సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని అంతే అద్భుతమైన స్థాయిలో ఆదరించాలని, ప్రేమించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ది గోట్ లైఫ్ టీమ్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను ముగించారు కమల్ హాసన్.
బెన్యమిన్ బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా తెరకెక్కిన ఆడుజీవితం: ది గోట్ లైఫ్ సినిమాకి బ్లెస్సీ దర్శకత్వం వహించారు, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీతో సహా ఐదు భాషలలో ఈ సినిమా పాన్-ఇండియన్ స్థాయిలో రేపు అంటే మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు.