iDreamPost
android-app
ios-app

ఇళయరాజాకి భారతరత్న… కమల్ హసన్ డిమాండ్

ఇళయరాజాకి ఓ ఫ్యాన్ గా తన జీవితం ప్రారంభమైందని, తర్వాత ఆయన సంగీతం చేసిన సినిమాలలో నటించే అవకాశం లభించిందని చెబుతూ తర్వాతి రోజులలో వారిద్ధరూ ఒకే స్థాయికి వచ్చారని చెప్పారు.

ఇళయరాజాకి ఓ ఫ్యాన్ గా తన జీవితం ప్రారంభమైందని, తర్వాత ఆయన సంగీతం చేసిన సినిమాలలో నటించే అవకాశం లభించిందని చెబుతూ తర్వాతి రోజులలో వారిద్ధరూ ఒకే స్థాయికి వచ్చారని చెప్పారు.

ఇళయరాజాకి భారతరత్న… కమల్ హసన్ డిమాండ్

అపూర్వ సంగీతదర్శకుడు ఇళయరాజాకి భారతరత్న రావాలని, ఇవ్వాలని ఉలఘనాయగన్ కమల్ హసన్ డిమాండ్ చేశారు. ఇళయరాజాకి ఓ ఫ్యాన్ గా తన జీవితం ప్రారంభమైందని, తర్వాత ఆయన సంగీతం చేసిన సినిమాలలో నటించే అవకాశం లభించిందని చెబుతూ తర్వాతి రోజులలో వారిద్ధరూ ఒకే స్థాయికి వచ్చారని చెప్పారు. ఇదెప్పుడంటే…ఇళయరాజా జీవితం అధారంగా ఆయన బయోపిక్ చిత్రాన్ని ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సందర్భంలో పాల్గొన్న కమల్ పై విధంగా కామెంట్ చేశారు. ‘’ఇళయరాజా గురించి మాట్లాడాలంటే ఎక్కడనుంచి మొదలు పెట్టాలో కూడా తెలియడం లేదు. దాదాపుగా మా ఇద్దరిదీ ఒకే ప్రయాణం. ఇంచుమించు ఒకేసారి మొదలైంది. ఆయన తర్వాత నేనెప్పుడో పుట్టినా కూడా ఇళయరాజా ఫేన్ అయి ఉండేవాడిని.

ఆయన ఏది సాధించినా నేనెంతో ఆనందించాను. ఇళయరాజాని అసహ్యించుకున్నవారైనా కూడా ఆయన బయోపిక్ ఫిల్మ్ తీయొచ్చు.’’ అని అన్నారు. ఇళయారాజా బయోపిక్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేస్తున్న అరుణ్ మాతేశ్వరన్ కి కమల్ సలహా ఇస్తూ ‘’ దేనికీ ఒత్తిడి ఫీలవద్దు. ఏం తీయాలన్నా ధైర్యంగా తెరకెక్కించు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఫిల్మ్ జస్ట్ ఇళయరాజా మీదనే కాదు….భారతరత్న ఇళయరాజా మీద అని మరచిపోవద్దు. ఇళయరాజాకి భారతరత్న రావాలన్నది ఆశ కాదు, డిమాండ్. ఎందుకంటే ఆయన చేసిన సంగీతం ఎన్నాళ్ళైనా అజరామరంగా ఉంటుంది. ఉండి తీరుతుంది.’’ అన్నారు.

ఇళయరాజా క్యారెక్టర్ చేయడం నా లక్

Kamal haasan about bharata ratna to ilayaraja

ఇళయరాజా పాత్రని ప్రముఖ తమిళనటుడు ధనుష్ చేస్తుండడంతో ఈ సినిమాకి గొప్ప క్రేజ్ లభించింది. అదీ ఇళయరాజా కోరిక మేరకే తాను ఈ సినిమాని అంగీకరించడమన్నది కూడా తన జీవితంలో ఎదురుచూడని తిరుగులేని గొప్ప అవకాశమని బయోపిక్ ప్రారంభోత్సవంలో ధనుష్ మనసులో మాటని విప్పిచెప్పాడు. తర్వాత ఇళయరాజాతో తన అనుబంధం గురించి చెబుతూ ధనుష్ ‘’ నేను ఆయనకి ఫేన్ ని మాత్రమే కాదు. ఆయన భక్తుడిని కూడా అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. జీవితంలో ప్రతీ అడుగులోనూ ఆయన సంగీతమే నన్ను అత్యంత ప్రభావితం చేసింది. నిజానికి చెప్పాలంటే ఆయన సంగీతమే నాకు నటనలో గురువు. ఆయన చేసిన పాట వినిగానీ లేదా బిజిఎం గానీ విన్నాక, దానికి ముందు సీనులో ఎలా నటించాలో నాకు ఒక క్లూ దొరుకుతుంది. అందరూ అంటున్నారు నాకిది పెద్ద ఛాలెంజ్ అని. నేను మాత్రం అలా అనుకోవడం లేదు.

ఎందుకంటే ఆయన సంగీతం కరెక్టుగా గైడ్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ ప్రాజెక్టులో అవకాశం రావడం ఎవ్వరికైనా గొప్ప లక్. నాకది ఎదురొచ్చింది. ఇళయరాజాగారి దగ్గరనుంచే ఆహ్వానం రావడం మరీ పెద్ద లక్. గొప్ప ఫీలింగ్. అందరూ ఇళయరాజాగారి పాటలు విని హాయిగా నిద్రపోతారు. నన్ను ఆ పాటలు ఎప్పుడూ నిద్రపోనివ్వలేదు. నా వరకూ నాకు నటుడిగా రెండు బయోపిక్స్ చేయాలన్నది చిరకాల స్వప్నాలు. ఒకటి ఇళయరాజాగారిది. రెండోది తలైవర్ రజనీకాంత్ గారిది. ఒక అవకాశం వచ్చింది. రెండోది కూడా రావాలని ఆశ పడుతున్నాను.’’ అని చాలా ఎక్సైటింగ్ గా చెప్పాడు ధనుష్ ఇళయరాజా బయోపిక్ ని కనెక్ట్ మీడియా, పికె ప్రైం ప్రొడక్షన్స్, మెర్క్యురీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లోగడ ధనుష్, అరుణ్ మాతేశ్వరన్ కాంబినేషన్లో కెప్టెన్ మిల్లర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మరో అద్భుతమేంటంటే….ఇళయరాజా బయోపిక్ కి సంగీతం మరెవరో కాదు. స్వయంగా ఇళయరాజాయే చేయడం విశేషం. ఈ ప్రారంబోత్సవానికి ప్రముఖ తమిళ సినీ దర్శకుడు భారతీరాజా, కమల్ హాసన్, వెట్రిమారన్ వంటివారు హాజరయ్యారు.