iDreamPost
android-app
ios-app

డెవిల్ పై అంచనాలు పెంచుతున్న టీజర్! కళ్యాణ్ రామ్ కి మరో హిట్టు కన్ఫర్మా..?

  • Author ajaykrishna Published - 12:24 PM, Wed - 5 July 23
  • Author ajaykrishna Published - 12:24 PM, Wed - 5 July 23
డెవిల్ పై అంచనాలు పెంచుతున్న టీజర్! కళ్యాణ్ రామ్ కి మరో హిట్టు కన్ఫర్మా..?

టాలీవుడ్‌ లో రెగ్యులర్ గా ఎక్స్పరిమెంటల్ మూవీస్ చేసే హీరోలు తక్కువగా ఉన్నారు. అయితే ఎలాంటి కథతో అయినా రిస్క్ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. తన ఇమేజ్, మార్కెట్ లను పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తుంటాడు. ఇప్పటిదాకా అలాంటి ప్రయోగాలు చేసి ఎన్నోసార్లు నిరాశచెందినా.. చేసే ప్రయోగాలు చేస్తూనే వస్తున్నాడు. అలా చేస్తూనే గతేడాది బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే.. హీరోగా, ప్రొడ్యూసర్ గా ఆ సినిమాతో మంచి లాభాలు పొందాడని చెప్పాలి. అయితే.. బింబిసార విజయం తర్వాత కళ్యాణ్ రామ్ మూవీస్ పై మళ్లీ ఫ్యాన్స్ కి ఆశలు చిగురించాయి. వెరసి ఇప్పుడు అవే అంచనాలు తన తదుపరి మూవీస్ పై ఏర్పడ్డాయి.

ఇక ఈ ఏడాది ‘అమిగోస్’ మూవీ చేసినా పెద్దగా ఫలితం మిగలలేదు. కానీ.. మొదటిసారి కళ్యాణ్ రామ్ త్రిపాత్రభినయం చేశాడు. ఇదిలా ఉండగా.. తాజాగా నవీన్ మేడారం డైరెక్షన్ లో డెవిల్ గా మెప్పించడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే.. ఈరోజు కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్బంగా మూవీ టీమ్ డెవిల్ టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ చూస్తుంటే.. కళ్యాణ్ రామ్ ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్రం పూర్వం నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది.

అదీగాక టీజర్ లో డైలాగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘మీరు చెప్పేదానికి.. చేసేదానికీ, ఆలోచించే దానికీ అసలు సంబంధం లేదు సార్’ అంటూ సాగే డైలాగ్‌ తో హీరో పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. అనంతరం.. “మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండవలసిన ముఖ్య లక్షణం” అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం డెవిల్ టీజర్ మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మిస్తుండగా.. కళ్యాణ్ రామ్ సరసన రెండోసారి సంయుక్త మీనన్ నటిస్తోంది. మరి డెవిల్ టీజర్ అయితే.. ఆనాటి బ్రిటిష్ అంపైర్ ని గుర్తు చేస్తోంది. డెవిల్ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetartemisbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş