iDreamPost
android-app
ios-app

Devil Twitter Review: కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ ట్విట్టర్ రివ్యూ.. వన్ మ్యాన్ షో!

  • Published Dec 29, 2023 | 8:37 AM Updated Updated Dec 29, 2023 | 1:10 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'డెవిల్'. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో.. ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'డెవిల్'. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో.. ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

Devil Twitter Review: కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ ట్విట్టర్ రివ్యూ.. వన్ మ్యాన్ షో!

నందమూరి కళ్యాణ్ రామ్.. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ముందుకుసాగుతున్న హీరో. ‘బింబిసార’ మూవీతో స్వింగ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘అమిగోస్’తో పర్వాలేదనిపించాడు. తాజాగా అతడు నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. బ్రిటీష్ పరిపాలన కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 29న) థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన రివ్యూలు ఆల్రెడీ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. మరి డెవిల్ సినిమా ఎలా ఉంది? ఈ ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

‘డెవిల్’ మూవీలో కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉన్నాయట. మరీ ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్లో ఉందంటున్నారు ట్విట్టర్ ప్రేక్షకులు. ఊరమాస్ ఫైట్స్, బ్లాక్ బస్టర్ హిట్ అంటూ బింబిసార విజయపథాన్ని కళ్యాణ్ రామ్ కొనసాగిస్తున్నారు అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. కాగా.. ఫస్ట్ హాఫ్ ను డీసెంట్ గా నేరేట్ చేసుకుంటూ పోయిన డైరెక్టర్ సెకండాఫ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాడట. సెకాండాఫ్ లో ట్విస్టులు, మలుపులు, చిల్ మూమెంట్స్ బాగానే ఉన్నాయట. గుడ్ థ్రిల్లర్ కమర్షియల్ మూవీ అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. మెుత్తానికి కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీతో మరో హిట్ కొట్టేశాడని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇంకొందరు మాత్రం సినిమా నుంచి ఎక్కువ ఆశించామని, కానీ అనుకున్నంత లేకపోవడంతో నిరాశ చెందామని మరికొందరు రాసుకొచ్చారు.

చదవండి :Devil Review in Telugu: డెవిల్‌ మూవీ రివ్యూ! )

 

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş