iDreamPost
android-app
ios-app

Kalyan Ram: జూనియర్‌ ఎన్టీఆర్‌ చిన్న కొడుకుపై కళ్యాణ్‌ రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Published Jan 11, 2024 | 11:09 AM Updated Updated Jan 11, 2024 | 11:09 AM

కల్యాణ్‌ రామ్‌ , జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంతో అన్యోన్యంగా అంటారన్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌ రామ్‌ జూనియర్‌ను నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్యా అంత మంచి అనుబంధం.

కల్యాణ్‌ రామ్‌ , జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంతో అన్యోన్యంగా అంటారన్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌ రామ్‌ జూనియర్‌ను నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్యా అంత మంచి అనుబంధం.

  • Published Jan 11, 2024 | 11:09 AMUpdated Jan 11, 2024 | 11:09 AM
Kalyan Ram: జూనియర్‌ ఎన్టీఆర్‌ చిన్న కొడుకుపై కళ్యాణ్‌ రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

నందమూరి కాంపౌండ్‌ నుంచి వచ్చినా.. హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కల్యాణ్‌ రామ్‌. తాజాగా ఆయన ‘డెవిల్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇక, ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచే గాక, విమర్శకుల నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. దాదాపు 30 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే సాధించింది.

సినిమా విడుదలకు ముందు కళ్యాణ్‌ రామ్‌ బిజీబిజీగా ప్రమోషన్లలో గడిపారు. ఈ సందర్భంగా సుమ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమ కల్యాణ్‌ రామ్‌ను ఓ ప్రశ్న వేసింది. ‘‘ ఇంట్లో మీ పిల్లలు తారక్ పిల్లలు కలిస్తే.. గోలగోలగా ఉంటుంది కదా? ఎవరు బాగా అల్లరి చేస్తారు?’’ అని అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కల్యాణ్‌ రామ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ చిన్న కుమారుడి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. ‘‘ మా పిల్లలు కాస్త పెద్ద అయ్యారు. కాబట్టి అల్లరి ఉండదు.

Bhargav Maha Dhakri

కానీ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ మాత్రం చాలా ముదురు. బాగా అల్లరి చేస్తాడు’’ అని అన్నారు. అనంతరం ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభిస్తానని తండ్రి హరిక్రిష్ణకు చెప్పినప్పుడు .. ‘నటుడిగా నిర్మాతగా నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను అనేలా ఉంటే అభ్యంతరం లేదు’’ అని ఆయన అన్నారట. ఇక నా బ్యానర్ కు హరిలక్ష్మి అని అమ్మానాన్నల పేరు పెడదామని తండ్రితో చెప్పారట. ఆయన ఆ పేరు వద్దన్నారట.

‘నేడు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం తాతగారు ఎన్టీఆర్. ఆ మహానుభావుడి పేరు పెట్టు’ అని చెప్పారట. అందుకే తన ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అని పెట్టుకున్నానని కల్యాణ్‌ రామ్‌ అన్నారు. కాగా, డెవిల్‌ సినిమాలో కల్యాణ్‌ రామ్‌కు జంటగా సంయుక్త మీనన్‌ నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అభిషేక్‌ నామా దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. మరి, కల్యాణ్‌ రామ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ చిన్న కుమారుడిపై చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom