iDreamPost
android-app
ios-app

చాన్నాళ్ళకి కూతురిని కలుసుకున్న కళ్యాణ్ దేవ్.. ఆనందంతో ట్వీట్!

  • Published Feb 12, 2024 | 3:33 PM Updated Updated Feb 12, 2024 | 3:33 PM

మెగాస్టార్ ముద్దుల తనయ శ్రీజ.. కళ్యాణ్ దేవ్ కొన్ని రోజులుగా విడివిడిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరు అధికారికంగా విడిపోయారా లేదా అనేది వెల్లడించలేదు. కానీ వీరికి పుట్టిన కూతురు అప్పుడప్పుడు తండ్రితో గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు..

మెగాస్టార్ ముద్దుల తనయ శ్రీజ.. కళ్యాణ్ దేవ్ కొన్ని రోజులుగా విడివిడిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరు అధికారికంగా విడిపోయారా లేదా అనేది వెల్లడించలేదు. కానీ వీరికి పుట్టిన కూతురు అప్పుడప్పుడు తండ్రితో గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు..

  • Published Feb 12, 2024 | 3:33 PMUpdated Feb 12, 2024 | 3:33 PM
చాన్నాళ్ళకి కూతురిని కలుసుకున్న కళ్యాణ్ దేవ్.. ఆనందంతో ట్వీట్!

ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎలా వార్తల్లో నిలుస్తాయో.. విడాకులు కూడా సెన్సేషనల్‌ సృష్టిస్తుంటాయి . అయితే సినీ ప్రముఖులు పెళ్లిళ్లు చేసుకోవడం, విడిపోవడం ఇదేమీ కొత్త కాదూ. ఎప్పటి నుండో జరుగుతున్నవే. కొంత మంది స్టేట్ మెంట్ పాస్ చేస్తూ ఉంటారు. మరికొంత మంది బయటకు చెప్పరు. అలాంటి జంటల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి తనయ శ్రీజ, కళ్యాణ్ దేవ్. వీరిద్దరూ గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారని మీడియా కోడై కూస్తున్న సంగతి విదితమే. విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట. అయితే విడివిడిగా కనిపించడంతో పాటు.. వీరి సంతానం.. నవిష్క.. అమ్మ దగ్గర ఉంటుంది. అప్పుడప్పుడు కళ్యాణ్ వద్దకు వస్తూ ఉంటుంది.

ఇప్పుడు ఈ తండ్రి ఆమె రాకతో మురిసిపోతున్నాడు. కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజున పురస్కరించుకుని నవిష్క తండ్రి దగ్గరకు వచ్చింది. దీంతో సంబరపడిపోతున్నాడు ఆ పిచ్చి తండ్రి. ఆమె సమక్షంలో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడమే కాదూ.. పాపతో ఎంజాయ్ చేశాడు. ఆ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకున్నాడు కళ్యాణ్ దేవ్. అందులో నవిష్క ముద్దు ముద్దు మాటలతో తండ్రి పొంగిపోతున్నాడు. ‘ నీ రాకతో నా పుట్టిన రోజు చాలా ప్రత్యేకంగా మరింది. నీతో సమయం గడపడం.. శాశ్వతమైన జ్ఞాపకాలను కోసం నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను నవిష్క. లవ్ యూ టూ ది మూన్ అండ్ బ్యాక్ ’ అంటూ ఎమోషనల్ పోస్టు రాశాడు.

కాగా, కళ్యాణ్ దేవ్, శ్రీజకు 2016లో వివాహం జరిగింది. 2018లో కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. విజేత అనే మూవీలో యాక్ట్ చేశాడు. అది ఓకే అనిపించగా.. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెర సాని చిత్రాల్లో కనిపించాడు. అయితే ఈ సమయంలో శ్రీజ, కళ్యాణ్ మధ్య పొరపచ్చాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతకు ముందు శ్రీజ..భర్త, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తుండేది. కాని ఒక్కసారిగా ఆమె కళ్యాణ్ దేవ్‌తో ఉన్న కొన్ని ఫోటోలను తీసేయడంతో రూమర్స్ స్టార్ అయ్యాయి. వాటికి ఆజ్యం పోస్తూ ఇద్దరు విడివిడిగా కనిపించడం స్టార్ చేశారు. నవిష్క కోసం అతడు పలుమార్లు మిస్ అవుతున్నట్లు పెట్టే పిక్స్.. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారన్న వార్తలు గుప్పుమనిపించాయి. కాగా, కళ్యాణ్ మెగా ఫ్యామిలీ సపోర్టు లేకపోవడంతో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom