iDreamPost

వీడియో: కల్కి షూటింగ్ సమయంలో దీపికా ప్రెగ్నెంటా..? నటుడి స్పందన ఇదే

జూన్ 27న రిలీజైన కల్కి 2898 ADలో పెద్ద పెద్ద స్టార్లకే కాకుండా.. చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్లకు కూడా బాగా గుర్తింపు వచ్చింది. వారిలో ఓ క్యారెక్టర్ అజ్జు. రేపటి కోసం అంటూ సీరియస్ డైలాగ్ చెప్పి కనువిందు చేశాడు. తాజాగా ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

జూన్ 27న రిలీజైన కల్కి 2898 ADలో పెద్ద పెద్ద స్టార్లకే కాకుండా.. చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్లకు కూడా బాగా గుర్తింపు వచ్చింది. వారిలో ఓ క్యారెక్టర్ అజ్జు. రేపటి కోసం అంటూ సీరియస్ డైలాగ్ చెప్పి కనువిందు చేశాడు. తాజాగా ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

వీడియో: కల్కి షూటింగ్ సమయంలో దీపికా ప్రెగ్నెంటా..? నటుడి స్పందన ఇదే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కాగా, ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తొలి రోజే రూ. 191 కోట్లను కొల్లగొట్టి.. బాక్సాఫీసుకు సరైనోడు దొరికాడని మరోసారి రుజువు చేసింది ఈ మూవీ. భైరవ పాత్రతో పాటు కర్ణుడు క్యారెక్టర్లలో ప్రభాస్‌ను చూసి ఇది కదా మాకు కావాల్సింది అని పండుగ చేసుకుంటున్నారు ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్. డైరెక్టర్ నాగీని అయితే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం సినిమాతో పాటు దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కలెక్షన్ల సునామీ చూసి బీటౌన్ కూడా కుళ్లుకుంటుంది. అయితే అమితాబ్‌కు ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలిసి బాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిన్నచిన్న క్యారెక్టర్లకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. రాయ పాత్రలో కేయ నాయర్, హర్షిత్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రేపటి కోసం అంటూ అజ్జు పాత్రలో సీరియస్ క్యారెక్టర్ నటించాడు..ఆయాజ్ పాషా. తాజాగా ఐడ్రీమ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పక్కా తెలుగు అబ్బాయైన ఆయాజ్.. ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేశానని చెప్పాడు. ‘అమ్మది విజయనగరం, నాన్నది హైదరాబాద్.. చిన్నప్పటి నుండి సీబీఎస్సీలో చదవడం వల్ల తెలుగు రాదు. ఆర్కిటెక్‌గా మేడెన్ హెవెన్ సీజన్ 2 చేస్తున్నప్పుడు.. కల్కి మూవీ ఆడిషన్ ఉంది.. వెళ్లు అని ఫ్రెండ్ చెప్పాడు. అప్పుడు మోనోలాగ్ ఆడిషన్ ఇచ్చాను. రెండు నెలల తర్వాత..కాల్ వచ్చింది. దీపికాతో షూటింగ్ వారం రోజులు ఉంటుంది అని చెప్పారు. అయితే నాగీకి అంతకు ముందు.. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని ఇన్ స్టాలో మేసేజ్ చేశాను’ అని వెళ్లడించాడు

కాగా, దీపికా ప్రెగ్నెంట్‌గా ఉండగానే… ఈ షూటింగ్ చేసినట్లు వార్తలపై ఆయాజ్ స్పందించాడు. ‘ మూడు సంవత్సరాల పాటు ఈ ఫిల్మ్ షూటింగ్ జరిగింది. అప్పటికే ఆమెపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. దీపికా ప్రెగ్నెంట్ అయ్యే సమయానికి డూప్లికేట్ వచ్చారు. కానీ ఎప్పుడు నాగీతో సెట్లో జోక్ చేసేది దీపికా. నువ్వు సినిమా రిలీజ్ చేసే నాటికి.. నేను కచ్చితంగా ప్రెగ్నెంట్‌గా ఉంటా అంటూ ఆటపట్టించేంది’అని చెప్పాడు. యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు చాలా కష్టపడ్డామని చెప్పాడు ఆయాజ్. ‘పశుపతితో ఓ సన్నివేశం చేసేటప్పుడు.. ముక్కులో బ్లడ్ వచ్చింది. అది నాగ్ అశ్విన్‌కు నచ్చింది. మేకప్, డ్రెస్ కోసం గంట సేపు పట్టేది. దీపికాను ఫస్ట్ చూడగానే.. చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా హంబుల్ యాక్టర్. నేను పెద్ద స్టార్ అయినా గర్వం ఉండదు.. చాలా చక్కగా, కలుపుగోలుగా మాట్లాడుతుంది’ అని చెప్పాడు. వీటితో పాటు పలు విషయాలను పంచుకున్నాడు ఆయాజ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి