Arjun Suravaram
Kalki 2898 AD: థియేటర్లలో అద్భుత విజయం సాధించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కల్క సంబంధించిన ఓ వార్త వాళ్లలో జోష్ నింపుతోంది.
Kalki 2898 AD: థియేటర్లలో అద్భుత విజయం సాధించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కల్క సంబంధించిన ఓ వార్త వాళ్లలో జోష్ నింపుతోంది.
Arjun Suravaram
పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో బిగెస్ట్ హిట్ గా ఈ సినిమా నిల్చింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మాగ్నమపస్ ఫిల్మ్‌ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ‘కల్కి’ ఓ రేంజ్ లో హావా చూపించింది.ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ప్రభాస్ సినిమా భారీ వసూళ్లు సాధించింది.
ఇక థియేటర్లలో అద్భుత విజయం సాధించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కల్క సంబంధించిన ఓ వార్త వాళ్లలో జోష్ నింపుతోంది. ఆగస్టు 23 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కల్కి హిందీ వెర్షన్ మాత్రం ఆగష్టు 23వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే సమయం ఇంకా ఉంది కాబట్టి.. ఈ లోపు అధికారిక ప్రకటన వచ్చేఅవకాశం ఉందని పలువురు సినీ ప్రియులు అభిప్రాయా పడుతున్నారు. గతంలో కూడా కల్కి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన ఈ టాక్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన సినీ ప్రియులు, మరోసారి ఓటీటీలో ఫ్లాట్ ఫామ్ వేదికగా చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈగర్ గా ఉన్నారు. ఇదే సమయంలో బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన కల్కి 2898 ఏడీ.. ఓటీటీ వేదికగా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తోందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇవన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే… మహాభారతంలో కురుక్షేత్రం జరిగిన తరువాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ కల్కి 2898 ఏడీ. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ, అప్పటికి చివరి పట్టణంగా మిగిలి ఉంటుంది. సుప్రీం యాస్కిన్ (కమల్‌హాసన్) భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలిస్తుంటాడు. కాశీలో బౌంటీ ఫైటరైన భైరవ (ప్రభాస్) యూనిట్స్‌ని సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడే ఉండిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటుంది.
అలా సుమతి (దీపికా పదుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ అమ్మ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి సుమతి అని వారు బలంగా నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవుల్లో ఒకరైనా అశ్వత్థామకీ, భైరవకీ సంబంధం ఏమిటి?. సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ – కె అసలు టార్గెట్ ఏమిటి? అనే పూర్తి విషయాలు తెలియాలంటే.. కల్కి2898ఏడీ సినిమా చూడాల్సిందే. మరికొద్ది రోజుల్లో ఓటీటీలో రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.