Keerthi
ప్రస్తుతం దేశంలోని అన్ని థియేటర్స్ లో కల్కి 2898 AD సినిమానే సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే థియేటర్లో విడుదలైన నాలుగు రోజులకే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూ కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది. పైగా ఈ సినిమాకు ఓటీటీ పార్టనర్ కూడా లాక్ చేసిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా కల్కి మూవీ నెల రోజుల తర్వాత చూడలనుకునే వారికి ఊహించని బ్యాడ్ న్యూస్ అందింది. కారణం అదే..
ప్రస్తుతం దేశంలోని అన్ని థియేటర్స్ లో కల్కి 2898 AD సినిమానే సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే థియేటర్లో విడుదలైన నాలుగు రోజులకే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూ కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది. పైగా ఈ సినిమాకు ఓటీటీ పార్టనర్ కూడా లాక్ చేసిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా కల్కి మూవీ నెల రోజుల తర్వాత చూడలనుకునే వారికి ఊహించని బ్యాడ్ న్యూస్ అందింది. కారణం అదే..
Keerthi
ప్రస్తుతం దేశంలోని అన్ని థియేటర్స్ లో ‘కల్కి 2898 AD’ సినిమానే సందడి చేస్తోంది. కాగా, ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కల్కి సినిమా దుమ్మురేపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు అందరీ కళ్లు ఈ సినిమా డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ పైనే ఉన్నాయి. ముఖ్యంగా ఈతరం యువతకు మహాభారతంను కళ్లముందే అద్భుతంగా నాగీ చూపించడంతో.. ఇటు ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు ఆయనను ప్రశంసిస్తున్నారు. కాగా, ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్రప్రసాద్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తదితరులు నటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే కేవలం కల్కి సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే దాదాపు 500 కోట్లు వసూల్ చేసి నాయా రికార్డు సృష్టించింది.అయితే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికి థియేటర్లలో హొస్ ఫుల్ కలెక్షన్స్ తో నిండిపోతున్న విషయం తెలిసిందే. కాగా, మరోపక్క ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ పార్టనర్ గా కల్కిని లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కల్కి సినిమా ఓటీటీ గురించి కొన్ని రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైగా ఈ సినిమాను నెలరోజుల తర్వాత ఓటీటీలో చూడాలనుకునే వారికి ఓ చేదు వార్త అందింది. ఇంతకి ఏం జరిగిందంటే..
చిన్న హీరో సినిమా అయినా పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా అయినా.. కొత్తదైతే చాలు నెలరోజుల్లోనే ఓటీటీలో చూసేయాలని చాలామంది ఓటీటీ లవర్స్ ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే కల్కి 2898 AD కూడా త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ, ఈ విషయం ఓటీటీ లవర్స్ కు ఊహించని బ్యాడ్ న్యూస్ అందింది. ఇప్పటికే కల్కి సినిమా తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ వెర్షణ్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే హిందీ వెర్షన్ ను హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకందని రూమర్స్ వస్తున్నాయి.ఇదిలా ఉంటే.. కల్కి మూవీ ఈ నెల అనగా జూలై చివరి నాటికి ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో వస్తుందనని అందరూ అనుకన్నారు. కానీ, ఆ విషయంలో కల్కి మూవీ నిర్మాతలు మనసు మార్చుకున్నట్లు సమాచాం తెలిసింది.
ఎందుకంటే.. కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పుడు థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న విషయ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాను ప్రభాస్ అభిమానులే ఒకటికి రెండు సార్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాకు వీకెండ్ లో కూడా భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓటీటీలో కల్కి సినిమా రిలీజ్ చేయడం తగదని చిత్రబృందం ఈ సినిమాను వాయిదా వేశారు. కాగా, ప్రస్తుతం చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. కల్కి మూవీ సెప్టెంబర్ 2వ వారం తర్వాత మాత్రమే ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. అయితే అనుకున్న సమయం కన్నా ముందుగానే కల్కి మూవీ ఓటీటీలోకి వస్తుందో లేదో అనేది చూడాల్సి ఉంది. మరి, ప్రస్తుతం ప్రభాస్ కల్కి మూవీ ఓటీటీ పై ఆలస్యంగా రాబోతుందనే బ్యాడ్ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.