iDreamPost
android-app
ios-app

కల్కి 2898 AD ట్రైలర్ రిలీజ్.. రికార్డ్స్ చూసుకో.. ఈసారి అంతకు మించే!

  • Published Jun 10, 2024 | 7:29 PM Updated Updated Jun 10, 2024 | 7:33 PM

Kalki 2898 AD Movie Trailer Review: డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ ట్రైలర్ రానే వచ్చేసింది. జూన్ 27న థియేటర్లు దద్దరిల్లిపోతాయి అనే విషయం అయితే ఈ ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.

Kalki 2898 AD Movie Trailer Review: డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ ట్రైలర్ రానే వచ్చేసింది. జూన్ 27న థియేటర్లు దద్దరిల్లిపోతాయి అనే విషయం అయితే ఈ ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.

  • Published Jun 10, 2024 | 7:29 PMUpdated Jun 10, 2024 | 7:33 PM
కల్కి 2898 AD ట్రైలర్ రిలీజ్.. రికార్డ్స్ చూసుకో.. ఈసారి అంతకు మించే!

కల్కి 2898 AD.. ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు. ఇంకో ఏడాదిపాటు గ్యాప్ లేకుండా వినిపిస్తూ ఉండే పేరు కూడా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ రేంజ్ లో డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అంతా హాలీవుడ్ ఏంట్రా హాలీవుడ్ అనే పరిస్థితికి వచ్చేశారు. ఒక్కో సీన్, ఒక్కో షాట్ కి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మరి.. ఈ కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఎప్పుడూ లేని విధంగా కల్కి మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత.. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న బుజ్జిని పాన్ ఇండియా లెవల్లో ప్రతి సిటీకి పంపి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎక్కడైనా హీరో, హీరోయిన్, క్రూ వెళ్లి ప్రమోషన్స్ చేస్తుంది. కానీ, ఇక్కడ మాత్రం బుజ్జితో ప్రమోషన్స్ చేయించడం చాలా కొత్తగా ఉంది. ఆ రేంజ్ ప్రమోషన్స్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వాటిని రెండింతలు కాదు.. పదింతలు చేస్తూ కల్కి సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంతా హాలీవుడ్ మూవీ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఇందుకోసం కదా.. ఇన్నాళ్లు వెయిట్ చేశాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ నుంచి క్లోజింగ్ వరకు రెప్పవేయకుండా కళ్లప్పగించి చూసే విధంగా ఉంది. ఇది ఒక విజువల్ వండర్ అంటూ ఫిల్మ్ మేకర్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరహా సీన్స్, టేకింగ్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాకుండా ఈ ట్రైలర్ లో కథ కూడా చెప్పేశారు. ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ సిరీస్లో కల్కి వరల్డ్ ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కథ పరంగా కూడా కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ ఒక క్లియర్ థాట్ తో థియేటర్లకు తీసుకురావాలి అనేది ఉద్దేశం కావచ్చు.

ఇంక ఈ ట్రైలర్ లో ప్రతి క్యారెక్టర్ ని పరిచయం చేసినట్లు ఉంది. కానీ, ఇంకా కొన్ని పాత్రలను సిల్వర్ స్క్రీన్ మీద సర్ ప్రైజ్ చేసేందుకు దాచి ఉంచారు అనే భావన కలుగుతోంది. అయితే ఇన్నాళ్లు భైరవకు అశ్వత్థామ గురువు అవుతారు అనుకున్నారు. కానీ, అశ్వత్థామకు భైరవ పోటీ అవుతున్నాడు. వారి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ కచ్చితంగా విజిల్వ్ వేయించే విధంగానే ఉంది. కల్కి సినిమాలో ప్రభాస్ ఒక బౌంటీ హంటర్ అని అందరికీ తెలిసిందే. కాంప్లెక్స్ లోకి వెళ్లాలి అనే అతని ఆశయం కోసం తాను చేసే యుద్ధాన్ని ఫస్ట్ ఆఫ్ లో చూడచ్చు. ఇంక సెకండాఫ్ మొత్తం ప్రభాస్ మాస్ యాక్షన్ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. అలాగే కల్కి ప్రభాస్ కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొణే కనే బిడ్డే కల్కి అవుతాడని చెప్తున్నారు. మరి.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş