iDreamPost
android-app
ios-app

ఈ చిన్నది ప్రభాస్ మూవీ హీరోయిన్.. కుర్రకారును మెలిపెట్టి అంతలోనే

  • Published Jul 15, 2024 | 4:31 PM Updated Updated Jul 15, 2024 | 4:31 PM

తల్లి చేతిలో ఒదిగిపోయిన ఈ చిన్నారి ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఇటీవల తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.. కుర్రకారు హృదయాలను దోచేసింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరంటే..?

తల్లి చేతిలో ఒదిగిపోయిన ఈ చిన్నారి ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఇటీవల తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.. కుర్రకారు హృదయాలను దోచేసింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరంటే..?

  • Published Jul 15, 2024 | 4:31 PMUpdated Jul 15, 2024 | 4:31 PM
ఈ చిన్నది ప్రభాస్ మూవీ హీరోయిన్.. కుర్రకారును మెలిపెట్టి అంతలోనే

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ, అక్కడ మీడియా తక్కువ చేసి చూడటం,మాట్లాడటం చేసేవి. ఇక ఇక్కడ స్టార్లకు గౌరవం పక్కన పెడితే.. తగిన గుర్తింపు ఉండేది కాదు. ఈ విషయాన్ని ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నేడు బాలీవుడ్ మెడలు వచ్చింది టాలీవుడ్. ఖాన్స్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కూడా దక్కని కలెక్షన్స్, క్రేజీనెస్ సౌత్ సినిమాలకు ముఖ్యంగా టీటౌన్ చిత్రాలకు దక్కుతున్నాయి. రాజమౌళి అందుకు పునాదులు వేస్తే.. వాటి వెంట గోడ పేర్చుకు వచ్చారు దర్శక నిర్మాతలు. ఇక హీరోల సంగతి చెప్పనక్కర్లేదు. ఇక్కడ టైర్ ఏ హీరోస్ అంతా హిందీ పరిశ్రమలో క్రేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు హోల్ సినీ ఇండస్ట్రీకి తెలుగు సినిమా రంగం మార్గ నిర్దేశకంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే.. తెలుగు సినిమాల్లో పని చేయాలని అందాల భామలు ఊవిళ్లూరిపోతున్నారు. చిన్న క్యారెక్టర్ అయినా సరే, రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. అలా వచ్చిన హీరోయిన్లలో ఈ చిన్నారి కూడా ఒకరు. తల్లి చేతిలో ఒదిగిపోయి.. టోపీ పెట్టుకుని ముద్దుగా ఫోజలిస్తున్న ఈ పాప.. మామాలూ హీరోయిన్ కాదు.. సక్సెస్ ఫుల్ నటి. ఇటీవల తెలుగులో ఓ భారీ బడ్జెట్ మూవీతో ఆకట్టుకుంది. చిన్న పాత్రలో మెస్మరైజ్ చేసింది. కానీ ఆమె క్యారెక్టర్ స్మాష్ చేసేయడంతో దిగులు చెందుతున్నారు కుర్రకారు. ఇంతకు ఆ నటి ఎవరో అర్థమైంది కదా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీ చిత్రంలో కైరా పాత్రలో మెరిసిన రింగు రింగుల జుట్టుల పోరీ అన్నా బెన్.

మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో కుట్టి. ఫిల్మీ బ్యాగ్రౌండ్ అయిన.. స్వయం శక్తితో ఎదిగింది. మాలీవుడ్ స్క్రీన్ రైటర్ బెన్నీ పి. నాయరాంబళం కూతురైన అన్నా.. కుంబలంగి నైట్స్ మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇందులో పహాద్ ఫజిల్ మరదలి పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత వచ్చిన హెలెన్, కప్పేలా ఆమెను మాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు, స్టార్ హీరోయిన్‌ను చేసేశాయి. సారా, నారదన్, నైట్ డ్రైవ్, కప్ప, త్రిశంకు వంటి చిత్రాలు చేసింది. ఇప్పుడు తెలుగు సినిమాతో పాటు తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల రాక్షసి. తెలుగులో వస్తూ వస్తూనే కుంభ స్థలాన్ని కొట్టింది. కల్కిలో కైరా పాత్రలో మెరిసింది. కానీ ఆమె క్యారెక్టర్ ఎండ్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తట్టుకోలేకపోయారు ఫ్యాన్స్. ఇక ఈ బ్యూటీ అంచు సెంతుమ్ సెలీనియం అనే మూవీలో నటిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş