స్టార్స్ వస్తే.. తట్టుకోలేరా? విజయ్ దేవరకొండని టార్గెట్ చేసింది ఎవరు?

Kalki 2898 AD Movie- Trolls On Vijay Devarakonda: కల్కి 2898 ఏడీ మూవీ ఎంతో ఘన విజయాన్ని అందుకుంది. రెండ్రోజుల్లోనే రూ.298.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కానీ, ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన విజయ్ దేవరకొండ మీద ట్రోల్స్ చేస్తున్నారు.

Kalki 2898 AD Movie- Trolls On Vijay Devarakonda: కల్కి 2898 ఏడీ మూవీ ఎంతో ఘన విజయాన్ని అందుకుంది. రెండ్రోజుల్లోనే రూ.298.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కానీ, ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన విజయ్ దేవరకొండ మీద ట్రోల్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమా స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లింది కల్కి 2898 ఏడీ మూవీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సినీ అభిమానులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ చిత్రం. అభిమానులే కాదు.. సెలబ్రిటీలు, స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు, హీరోలు కూడా ఈ సినిమాకి నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమాలో ఏ చిన్న అవకాశం దక్కినా కూడా అది మహా భాగ్యం అని అంతా భావిస్తున్నారు. అయితే ఇదే సినిమాలో ఒక పవర్ ఫుల్ రోల్ చేసిన విజయ్ దేవరకొండపై మాత్రం దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అసలు వారి ప్రాబ్లమ్ విజయ్ దేవరకొండ చేసిన పాత్రతోనా? లేక విజయ్ దేవరకొండకు అంత మంచి పాత్ర దక్కింది అనా? లేదంటే కావాలనే అతడిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యువతలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ మాత్రమే కాకుండా.. టాలీవుడ్ లో స్టార్డమ్ కూడా ఉంది. మంచి మంచి సినిమాలతో అటు యువత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సెల్ఫ్ మేడ్ స్టార్ గా విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. నిజానికి తనని తాను లేపుకుంటూ వచ్చాడు. అది తన నటన కావచ్చు, మాట తీరు కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు. విజయ్ కష్టానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే కల్కిలో కూడా ఒక మంచి రోల్ అందుకున్నాడు. విజయ్ దేవరకొండ అది చేయగలడు అని నాగ్ అశ్విన్ నమ్మాడు కూడా. అందుకే అంత గొప్ప బాధ్యత అతనిపై పెట్టాడు.

నిజానికి వీళ్ల బంధం ఎవడే సుబ్రమణ్యం అప్పుడే మొదలైంది. విజయ్ దేవరకొండ మీద అంత నమ్మకం ఉంది కాబట్టే ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ కి విజయ్ ని సెలక్ట్ చేసుకున్నాడు. అంతే నమ్మకంగా రౌడీ హీరో కూడా పర్ఫామ్ చేశాడు. విజయ్ చేసిన పాత్ర పార్ట్ 1లో వచ్చింది కేవలం రెండుసార్లు కావచ్చు. కానీ, పార్ట్ 2లో మాత్రం కథలో చాలా కీలక పాత్ర అవుతుంది. ప్రభాస్ పాత్రతో సమానంగా.. నిజానికి పోటీగా నిలిచే క్యారెక్టర్ అది. అలాంటి పాత్రలో అద్భుతంగా విజయ్ దేవరకొండ పర్ఫామ్ చేస్తే మెచ్చుకోకపోగా.. ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా కావాలనే చేస్తున్నారు అనే వాదన కూడా ఉంది.

వాస్తవానికి టాలీవుడ్ లో వచ్చే భారీ కలెక్షన్స్ లో అత్యధిక భాగం వచ్చేది నైజాం ప్రాంతం నుంచే. కానీ, అక్కడి నుంచి స్టార్స్ మాత్రం రావట్లేదు. నిజానికి ఒక వర్గం రానివ్వట్లేదు.. వచ్చినా తట్టుకోలేరు ఇలాగే ట్రోల్స్ చేస్తారు అంటూ అభిప్రాయాలను కూడా వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే.. కావాలనే తమ నాయకుడిని ట్రోల్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా టార్గెట్ చేసి చేస్తున్న ట్రోలింగ్ అని మండిపడుతున్నారు. మరి.. విజయ్ పై వస్తున్న ట్రోల్స్ కి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments