Nidhan
Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేకర్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు కూడా లాభాల పంట పండించిందీ చిత్రం.
Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేకర్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు కూడా లాభాల పంట పండించిందీ చిత్రం.
Nidhan
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేకర్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు లాభాల పంట పండించిందీ చిత్రం. మూడో సినిమాతోనే పాన్ ఇండియా హిట్‌ను అందుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘కల్కి’ తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ.. ఇలా రిలీజైన ప్రతి చోట బంపర్ హిట్‌గా నిలిచింది. రిలీజై రెండు వారాలు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద స్టడీగా రన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.1,000 కోట్ల మార్క్‌ను అధిగమించిన ఈ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్.. ఫుల్ రన్ ముగిసేసరికి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ అనేది ఏ ఒక్క వ్యక్తికో లేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేయాల్సిన విషయం కాదు. ఈ చిత్రం విషయంలో టాలీవుడ్ మేకర్స్, యాక్టర్స్, ఫ్యాన్స్ ఎంతో గర్వపడుతున్నారు. అయితే ‘కల్కి’ విజయం ఇప్పుడు సౌత్ మేకర్స్‌లో కొంగొత్త ఆశల్ని పుట్టిస్తోందని గ్రహించాలి. ఇన్నాళ్లూ బాలీవుడ్‌పై దండయాత్ర చేసి.. పాన్ ఇండియా మార్కెట్‌ను కైవసం చేసుకున్న ఇక్కడి హీరోలు, దర్శకులు.. ఇప్పుడు ఏకంగా మిషన్ హాలీవుడ్‌కు రెడీ అవుతున్నారు. అప్పట్లో ‘బాహుబలి’ స్ఫూర్తితో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం పెరిగింది. వెయ్యి కాదు.. సరిగ్గా ప్లాన్ చేసి ఆడియెన్స్‌ను సీట్లకు కట్టిపడేసేలా సినిమాలు తీస్తే రెండు వేల కోట్లు కూడా కొట్టొచ్చనే ధైర్యం అందరిలో వచ్చింది.
దర్శక ధీరుడు రాజమౌళి వేసిన దారిలో పయనిస్తూ ఎన్నో సౌత్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో హ్యూజ్ సక్సెస్ చూశాయి. ‘పుష్ప’ నుంచి ‘కాంతార’ వరకు దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లతో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీస్‌కు టైమ్ వచ్చినట్లు అనిపిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’తో నాగ్ అశ్విన్ అందరిలోనూ స్ఫూర్తి నింపాడు. సరైన కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తీస్తే మూవీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని చూపించాడు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ లాంటి వేర్వేరు జోనర్లను కలిపి సైఫై అనే కొత్త జానర్‌ను పరిచయం చేశాడు. ఈ జోనర్‌ను పట్టుకుంటే పిల్లల నుంచి ముసలోళ్ల వరకు అన్ని రకాల ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించొచ్చని ప్రూవ్ చేశాడు. దీంతో ఇదే బాటలో పయనించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురు క్రేజీ సౌత్ మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి.. మిషన్ హాలీవుడ్లో మనోళ్లు ఎంత వరకు సక్సెస్ అవుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.