Nag Ashwin Helped To Government School: గొప్ప మనసు చాటుకున్న నాగ్ అశ్విన్.. ఆ పిల్లల కోసం ఏకంగా..!

Nag Ashwin: గొప్ప మనసు చాటుకున్న నాగ్ అశ్విన్.. ఆ పిల్లల కోసం ఏకంగా..!

స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నారు. ఏళ్ల పాటు కష్టపడి తీసిన ‘కల్కి 2898 ఏడీ’ ఘనవిజయం సాధించడంతో ఆయన హ్యాపీగా ఉన్నారు.

స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నారు. ఏళ్ల పాటు కష్టపడి తీసిన ‘కల్కి 2898 ఏడీ’ ఘనవిజయం సాధించడంతో ఆయన హ్యాపీగా ఉన్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నారు. ఏళ్ల పాటు కష్టపడి తీసిన ‘కల్కి 2898 ఏడీ’ ఘనవిజయం సాధించడంతో ఆయన హ్యాపీగా ఉన్నారు. ‘మహానటి’ వంటి బ్లాక్​బస్టర్ కొట్టాక ఆయన వెంటనే ఇంకో ప్రాజెక్ట్​ను స్టార్ట్ చేయలేదు. ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదనుకొని.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​తో ‘కల్కి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా కోసం చాలా టైమ్ తీసుకొని పని చేశారు నాగ్ అశ్విన్. అయితే ఆయన కష్టం వృథా పోలేదు. మార్నింగ్ షో నుంచే సూపర్ పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న ‘కల్కి’.. రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజంనం సృష్టించింది. ఈ సినిమాతో బిజినెస్​లో ఉన్నవారు ప్రాఫిట్స్ తెచ్చుకున్నారు.

‘కల్కి’ సక్సెస్​తో ఫుల్ హ్యాపీగా ఉన్న నాగ్ అశ్విన్.. ఇప్పుడిప్పుడే కాస్త ఫ్రీ అవుతున్నారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. త్వరలో ఆయన పార్ట్-2 పనుల్లో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఓ మంచి పనితో నాగీ వార్తల్లో నిలిచారు. ఆయన తన గొప్ప మనసును మరోమారు చాటుకున్నారు. నాగర్​కర్నూలు జిల్లా, తాడూరు మండలం, ఐతోలులో ఆయన విజిట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వ పాఠశాలలో సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను నాగ్ అశ్విన్ ప్రారంభించారు. తన సొంత గ్రామమైన ఐతోలులోని సర్కారు బడిలో అదనపు గదుల నిర్మాణానికి ఆయన ఆర్థిక సాయం అందించారు.

అదనపు గదుల ప్రారంభ కార్యక్రమంలో నాగ్ అశ్విన్​తో పాటు ఎమ్మెల్యే రాజేశ్, కలెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. నాగ్ అశ్విన్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. పిల్లల కోసం అదనపు గదుల నిర్మాణానికి ఆయన ముందుకు రావడం, సర్కారు బడి బాగు కోసం ఆర్థిక సాయం చేయడం మంచి విషయమని ప్రశంసిస్తున్నారు. నాగీ తన సేవా కార్యక్రమాలను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇక, ‘కల్కి 2’ గురించి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించనున్నట్లు తెలిపారు. అయితే మూవీ ఎగ్జాక్ట్​గా ఎప్పటికీ ఫినిష్ అవుతుందనే విషయం మాత్రం అప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు.

Show comments