iDreamPost
android-app
ios-app

2 నెలల ముందే సూర్య ‘కంగువ’ ట్రైలర్ .. రిలీజ్ డేట్ ఇదే!

  • Published Aug 10, 2024 | 2:39 PM Updated Updated Aug 10, 2024 | 2:39 PM

Kanguva Movie Latest Update: కోలీవుడ్ స్టార్ సూర్య .. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో తాజా సూర్య నటిస్తున్న సినిమా 'కంగువ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్.

Kanguva Movie Latest Update: కోలీవుడ్ స్టార్ సూర్య .. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో తాజా సూర్య నటిస్తున్న సినిమా 'కంగువ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్.

  • Published Aug 10, 2024 | 2:39 PMUpdated Aug 10, 2024 | 2:39 PM
2 నెలల ముందే సూర్య ‘కంగువ’ ట్రైలర్ .. రిలీజ్ డేట్ ఇదే!

ప్రముఖ నటుడు సూర్య అటు కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు.. టాలీవుడ్ ప్రేక్షకులలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. సూర్య సినిమాలంటేనే అందరికి ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పటివరకు సూర్య నటించిన ప్రతి మూవీ కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఇలా ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల మెప్పును గెలుచుకుంటున్నాడు సూర్య. ఈ క్రమంలో ప్రస్తుతం సూర్య నటిస్తున్న సినిమా ‘కంగువ ‘. అడపా దడపా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన బజ్ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా కంగువ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కోలీవుడ్ స్టార్ సూర్య , డైరెక్టర్ శివ కాంబినేషన్ లో కంగువ మూవీ తెరకెక్కబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో సూర్యకు జోడిగా బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తోంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. దీనితో ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా అక్టోబర్ 10న భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టిగ్ అప్ డేట్ వచ్చేసింది. అదేంటంటే.. మూవీ రిలీజ్ కు ఇంకా రెండు నెలలు సమయం ఉండగానే.. అప్పుడే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆగష్టు 12 న కంగువ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు . ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

kanguva tariler release date fix

సాధారణంగా ఏ సినిమా ట్రైలర్ అయినా.. థియేట్రికల్ రిలీజ్ కు పది రోజులు లేదా నెల ముందు రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ సూర్య కంగువ మాత్రం ఏకంగా రెండు నెలల ముందు రిలీజ్ చేయడం విశేషం. చూడబోతుంటే.. ఈ సినిమాతో ఎదో భారీగానే ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మీద అందరికి పాజిటివ్ హైప్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ పై ఎలాంటి అంచనాలు పెరుగుతాయో వేచి చూడాలి. మరి ఈ మూవీ ట్రైలర్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.