iDreamPost
android-app
ios-app

కాజోల్ మరో బోల్డ్ కోరిక! ఆ స్టార్ హీరోతో అలా చేయాలని ఉందంటూ..

  • Author ajaykrishna Published - 10:13 AM, Mon - 17 July 23
  • Author ajaykrishna Published - 10:13 AM, Mon - 17 July 23
కాజోల్ మరో బోల్డ్ కోరిక! ఆ స్టార్ హీరోతో అలా చేయాలని ఉందంటూ..

ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. కొంతమంది హీరోహీరోయిన్స్ ని తెరపై జంటగా చూస్తే.. అభిమానులలో కలిగే ఆనందమే వేరు. అయితే.. హీరోలంటే వయసు పైబడినా సినిమాలు కంటిన్యూ చేస్తుంటారు. కానీ.. హీరోయిన్స్ విషయంలో అలా కాదుగా! ముప్పై ఏళ్లు దాటితే చాలు. వెంటనే పెళ్ళి గోల మొదలైపోతుంది. ఆ తర్వాత హీరోయిన్స్ గా సినిమాలు తక్కువైపోతాయి. కొన్నాళ్ళకు హీరోయిన్స్ గా చేసిన వారంతా మదర్ లేదా ఏదైనా సైడ్ క్యారెక్టర్స్ లో ఎంట్రీ ఇస్తుంటారు. అయితే.. ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లకు పైగా కొనసాగుతున్న సీనియర్ హీరోయిన్.. కెరీర్ లో మొదటిసారి లిప్ లాక్ రూల్ ని బ్రేక్ చేసింది.

బాలీవుడ్ నటి కాజోల్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అందరు స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, రొమాంటిక్ సాంగ్స్ చేసిన కాజోల్.. ఇన్నేళ్లలో ఎన్నడూ హద్దులు దాటి అందాల ప్రదర్శన గానీ, రొమాంటిక్ సీన్స్.. ముద్దు సన్నివేశాలు చేయలేదు. కానీ.. మొదటిసారి సినిమా కోసం కాకుండా ఓ వెబ్ సిరీస్ కోసం.. లిప్ లాక్ రూల్ బ్రేక్ చేసేసింది. కాజోల్ ఇటీవల ‘ది ట్రయల్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఫస్ట్ టైం ఓటిటి స్క్రీన్ పై మెరిసిన కాజోల్ కి ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్. ప్రస్తుతం ఆ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఇందులో ఫస్ట్ టైమ్ కాజోల్ తన సహనటుడితో పెదవి ముద్దు పంచుకుంది. దీంతో కాజోల్ ఫ్యాన్స్ అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. వెబ్ సిరీస్ రిలీజ్ తర్వాత ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్.. తనకున్న మరో బోల్డ్ కోరికను బయట పెట్టింది. కాజోల్ – షారుఖ్ ల జంటకు బిగ్ స్క్రీన్ పై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాలు చేసి.. ఎవర్ గ్రీన్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటిది షారుఖ్ చాలకాలం తర్వాత ఈ ఏడాది పఠాన్ మూవీతో ఊహించని విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్.. షారుఖ్ గురించి మాట్లాడుతూ.. ‘నాకు షారుఖ్ ఎదురైతే పఠాన్ సినిమా నిజంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందా అని అడుగుతా..’ అని చెప్పిన కాజోల్.. ఆ తర్వాత షారుఖ్ తో ఓ రొమాంటిక్ సాంగ్ చేయాలని ఉందని తన కోరికను వెల్లడించింది. ప్రస్తుతం కాజోల్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. కాజోల్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş