iDreamPost
android-app
ios-app

రీఎంట్రీ ఇచ్చాక కాజల్ కండిషన్స్! అది మాత్రం కుదరదట!

  • Author ajaykrishna Published - 01:06 PM, Fri - 11 August 23
  • Author ajaykrishna Published - 01:06 PM, Fri - 11 August 23
రీఎంట్రీ ఇచ్చాక కాజల్ కండిషన్స్! అది మాత్రం కుదరదట!

ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఓ స్టేజ్ కి వచ్చాక తమకంటూ కొన్ని కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ కండిషన్స్ వల్ల ఫ్యాన్స్ కంగారు పడతారేమో గానీ.. హీరోయిన్స్ కి మాత్రం కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పాలి. స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు టాలీవుడ్ లో స్టార్స్ అందరి సరసన సినిమాలు చేసిన కాజల్.. గ్లామరస్ హీరోయిన్ గా ఎక్కువ పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా పెళ్లికి ముందు గ్లామర్ రోల్స్ తో పాటు ఏకంగా జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ అంటూ ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అలాంటిది హీరోయిన్ గా ఇంకొన్నాళ్ళు ఇండస్ట్రీని ఊపేస్తుంది అనుకున్న టైమ్ లో పెళ్లి చేసుకొని షాకిచ్చింది.

కట్ చేస్తే.. ఇప్పుడు కాజల్ ఓ బిడ్డకు తల్లి. దీంతో అందరూ ఇంకా సినిమాలేం చేస్తుందిలే అనుకున్నారు. కానీ.. అందరిని సర్ప్రైజ్ చేస్తూ.. మళ్లీ సినిమాలు మొదలు పెట్టేసింది. ఈసారి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ మూవీతో రీఎంట్రీకి రెడీ అయిపోయింది. ఆల్రెడీ సినిమా షూటింగ్ తుదిదశకు చేసుకోగా.. కాజల్ – బాలయ్యతో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా హిట్టు పడితే.. కాజల్ మళ్లీ హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ.. ఫ్యాన్స్ కి షాకిస్తూ కాజల్ ఓ కెరీర్ పరంగా కీలక నిర్ణయం తీసుకుందని టాక్ నడుస్తోంది. దీంతో అసలు కాజల్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఇలా అయితే తదుపరి సినిమాలలో కష్టమే అంటున్నారు అభిమానులు.

అసలు కాజల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే వివరాల్లోకి వెళ్తే.. కాజల్ ఇకపై గ్లామర్ పాత్రలకు, గ్లామర్ షోకి దూరంగా ఉండాలని అనుకుంటుందట. తన వద్దకు వస్తున్న స్క్రిప్ట్ లను కూడా.. గ్లామర్ రోల్స్ ని కూడా స్కిన్ షో చేయదలచు కోవట్లేదని రిజెక్ట్ చేస్తుందట. మొత్తానికి కాజల్.. గ్లామర్ షో ఒక్కటీ అడగొద్దు అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసిందని టాక్. అయితే.. కాజల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే రెండు పెద్ద సినిమాల ఆఫర్స్ మిస్ చేసుకుందని సినీ వర్గాల సమాచారం. ఇప్పుడు కాజల్ ఓ బిడ్డకు తల్లి కాబట్టి.. ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు అనేది కూడా న్యాయంగానే ఉందికదా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ చేతిలో బాలయ్య సినిమాతో సత్యభామ ప్రాజెక్ట్ ఉంది. మరి కాజల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişberlinbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom