iDreamPost
android-app
ios-app

కన్నకొడుకు చేతిలో హత్యకు గురైన సినీ నటి!

  • Published Feb 08, 2024 | 3:36 PM Updated Updated Feb 08, 2024 | 3:36 PM

అమ్మను మించిన దైవం ఈ భూమిపై లేదంటారు.. కానీ ఈ మధ్య కొంతమంది కొడుకులు కన్నతల్లిపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు.

అమ్మను మించిన దైవం ఈ భూమిపై లేదంటారు.. కానీ ఈ మధ్య కొంతమంది కొడుకులు కన్నతల్లిపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు.

కన్నకొడుకు చేతిలో హత్యకు గురైన సినీ నటి!

దేవుడు ఈ భూమిపై తనకు బదులుగా అమ్మను సృష్టించారని అంటారు. నవమాసాలు మోసీ కనీ పెంచిన తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. పుట్టినప్పటి నుంచి తన బిడ్డ ప్రయోజకుడై సమాజంలో గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటుంది.. అందు కోసం అహర్శశలు కష్టపడి సాకుతుంది. కంటికి రెప్పలా చూసుకునే తన బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చినా.. ప్రమాదం జరిగినా ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది కన్న తల్లిని వృద్దాప్యంలో అనాథలను చేస్తున్నారు కొంతమంది ప్రబుద్దులు. చివరి దశలో తనకు ఆసరా అవుతారని అనుకున్న కొడుకులు ఇంటి నుంచి గెంటివేస్తున్నారు.. అనాధాశ్రమాలకు పంపుతున్నారు. కొంతమంది పుత్రులు తల్లులపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. అలాంటి ఓ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కొంతమంది మద్యం, డ్రగ్స్ కి అలవాటు పడి ఆ మత్తులో విచక్షణ కోల్పోయి ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. మద్యం, డబ్బు పై పిచ్చి మనిషిన ఎంతకైనా దిగజార్చుతుందని.. అందుకు నిదర్శనం ఓ తమిళ నటి దారుణ హత్య. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ ‘కడైసి వివాసాయి’  తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి కాసమ్మాళ్. ఆ తర్వాత పలు చిత్రాల్లో కాసమ్మాళ్ నటించింది. ఫిబ్రవరి 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలో అనయ్యూర్ లో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెను హతమార్చింది సొంతకొడుకు కావడంతో అందరూ షాక్ కి గురయ్యారు.

 

కాసమ్మాళ్ల కొడుకు నామకోడి.. పెళ్లై పిల్లలు ఉన్న నామకోడి 15 ఏళ్లుగా తల్లివద్దే ఉంటున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన నామకోడి.. ప్రతిరోజూ తల్లి ఇచ్చే డబ్బుతో తాగుతూ జల్సాలు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా ఆమె డబ్బు ఇవ్వకుంటే గొడవపడి దాడి కూడా చేసేవాడని స్థానికులు అంటున్నారు. ఫిబ్రవరి 4 న తల్లీకొడుకు మధ్య పెద్ద గొడవ జరిగింది.. ఈ క్రమంలోనే ఆవేశంగా నామకోడి కత్తితో పొడిచి చంపేశాడు. ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు నామకోడిని అరెస్ట్ చేశారు. కాసమ్మాళ్, బాలసామి దంపతుల నలుగురి సంతానంలో నామకోడి ఒకరు. ఎం మణికండాని డైరెక్షన్ లో ‘కడైసి వివాసాయి’ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ మూవీలో నల్లంది, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. కాసమ్మాళ్ మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

Son killed actress asammal in tamil