iDreamPost
android-app
ios-app

డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత అరెస్ట్! భారీగా కొకైన్ స్వాధీనం..

  • Author Soma Sekhar Published - 01:13 PM, Wed - 14 June 23
  • Author Soma Sekhar Published - 01:13 PM, Wed - 14 June 23
డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత అరెస్ట్! భారీగా కొకైన్ స్వాధీనం..

కొంతకాలం క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనాన్ని రేపిందో మనందరికి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు అయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ, రవితేజ, సుబ్బరాజు, నందు, తనీష్ లతో పాటుగా మరికొంత మందిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో వారు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తెలియడంతో వారికి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రానికి తెలుగులో నిర్మాతగా వ్యవహరించారు కేపీ చౌదరి. తాజాగా ఆయన అరెస్ట్ టాలీవుడ్ లో సంచలనం రేపింది.

డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. ఈ డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి నుంచి భారీ ఎత్తున కెకైన్ స్వాధీనం చేసుకున్నారు. కేపీ చౌదరి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తేలడంతో.. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అతను గోవాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. గతంలో సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కబాలి చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు కేపీ చౌదరి.

అయితే ఈ కేసుకు గతంలో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాదులో కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న డ్రగ్స్ ముఠా నిర్మాత అరెస్ట్ తో ఒక్కసారిగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ అయ్యింది ప్రొడ్యూసర్ కాబట్టి, ఇతర నటీ, నటులతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో సైతం పోలీసులు తమ విచారణ కొనసాగిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş