iDreamPost
android-app
ios-app

జ్యోతికకు అత్తామామలతో గొడవలు? ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కదంటూ వార్తలు!

  • Published Mar 15, 2024 | 4:19 PM Updated Updated Mar 15, 2024 | 4:19 PM

కోలీవుడ్ బెస్ట్ కపుల్ సూర్య, జ్యోతికల కాపురం ప్రస్తుతం ముంబయికి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం సైతాన్ మూవీ హిట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న జ్యోతిక గురించి ఓ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే..?

కోలీవుడ్ బెస్ట్ కపుల్ సూర్య, జ్యోతికల కాపురం ప్రస్తుతం ముంబయికి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం సైతాన్ మూవీ హిట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న జ్యోతిక గురించి ఓ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే..?

  • Published Mar 15, 2024 | 4:19 PMUpdated Mar 15, 2024 | 4:19 PM
జ్యోతికకు అత్తామామలతో గొడవలు? ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కదంటూ వార్తలు!

కోలీవుడ్ క్యూట్ కపుల్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే జంట సూర్య, జ్యోతిక. ఈ రీల్ కపుల్ .. రియల్ కపుల్‌గా మారి చానా ఏళ్లయినా.. ఇప్పటికీ.. ది బెస్ట్ జోడీగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. సూర్య తన సినిమాలతో కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ నాట కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.  తన చిత్రాలతో ఇక్కడ థియేటర్లలో కూడా మాస్ కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ఇక జ్యోతిక పెళ్లి, పిల్లలు.. కుటుంబ బాధ్యతలు వెరసి  తెరకు కాస్త దూరంగా ఉన్నా.. 36 వయదినిలేతో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. తాజాగా బాలీవుడ్ మూవీ సైతాన్ చిత్రంతో హిట్ కొట్టింది. వీరిది ఉమ్మడి కుటుంబం అన్న సంగతి విదితమే. అయితే తాజాగా సూర్య ఫ్యామిలీ ముంబయి షిఫ్ట్ అయ్యింది

అక్కడ ఇల్లు కొనుకున్నారని తెలుస్తోంది. కాగా, సూర్య ఫ్యామిలీ ముంబయికి మార్చడం వెనుక ఇంటిపోరని వార్తలు వచ్చాయి. అత్తమామలకు, కోడలికి పడటం లేదని ముఖ్యంగా సూర్య ఫాదర్, నటుడు శివకుమార్ – జ్యోతికకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో బాలీవుడ్ షిప్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. పెళ్లికి ముందే ఆయన కండిషన్లు పెట్టారని, వివాహం తర్వాత ఆమె నటించడం  మామకు ఇష్టం లేకపోవడంతోనే గొడవలు వచ్చాయని పుకార్లు సర్క్యులేట్ అయ్యాయి. సూర్య మాత్రం ముంబయి టూ చెన్నై తిరుగుతున్నాడని తెలుస్తోంది. ఈ విషయంపై నటుడు కార్తి స్పందించారు. ఈ రూమర్లను కొట్టిపారేస్తూ ఆమెను తల్లితో పోలుస్తూ.. పిల్లల చదువుల కోసమే అక్కడకు వెళ్లినట్లు చెప్పారు.

Suriya jyotika family issues

ఇదిలా ఉంటే.. ఇంటి నుండి బయటకు వచ్చేసిన జ్యోతిక.. తిరిగి చెన్నై ముఖం కానీ.. అత్తారింటి గుమ్మం తొక్కలేదట. సూర్య ఒక్కరే అక్కడకు.. ఇక్కడకు తిరుగుతున్నారట. ఈ మధ్య కాలంలో జ్యోతిక సోదరి.. ముంబయి వెళ్లి ఏదో ఆహ్వాన పత్రిక ఇచ్చిందని, అయినప్పటికీ.. తమిళనాడులో సైతాన్ నటి అడుగుపెట్టలేదని తెలుస్తోంది. భార్య మాట కాదనలేక ఆమెను బలవంతం పెట్టడం లేదట సూర్య కూడా. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే.. ప్రస్తుతం సైతాన్ మూవీ చేస్తుండగా.. ఈ సినిమా రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లలో భాగంగా జ్యోతిక చెన్నై వెళ్లలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ.. ఈ నటికి అత్తారింటి ముఖం చూడటమే ఇష్టం లేదన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఠాగూర్ నటి రెండు హిందీ చిత్రాలు చేస్తోంది. సూర్య కంగువ మూవీతో బిజీ బిజీగా ఉంది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş