iDreamPost
android-app
ios-app

తారక్ వెట్రిమారన్ కాంబోలో మూవీ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది

  • Published Sep 19, 2024 | 11:35 AM Updated Updated Sep 19, 2024 | 12:49 PM

Jr.NTR- Vetrimaaran Movie Update: అభిమానులంతా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా దేవర ప్రమోషన్స్ లో భాగంగా తారక్ .. తమిళ దర్శకుడు వెట్రిమారన్ పేరు తీసుకొచ్చారు. దీనితో ఇప్పుడు అభిమానులలో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Jr.NTR- Vetrimaaran Movie Update: అభిమానులంతా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా దేవర ప్రమోషన్స్ లో భాగంగా తారక్ .. తమిళ దర్శకుడు వెట్రిమారన్ పేరు తీసుకొచ్చారు. దీనితో ఇప్పుడు అభిమానులలో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది.

  • Published Sep 19, 2024 | 11:35 AMUpdated Sep 19, 2024 | 12:49 PM
తారక్ వెట్రిమారన్ కాంబోలో మూవీ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజుకు.. ఇంకా ఎంతో సమయం లేదు. వెండి తెరపై తారక్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా.. దేవర కథ ఏమై ఉంటుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న్నారు. సెప్టెంబర్ 27న థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తారక్ చిత్ర బృందంతో కలిసి చెన్నై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ప్రెస్ మీట్ లో తారక్ మాటల సంధర్భంలో.. తన ఫేవరేట్ దర్శకుడు వెట్రిమారన్ తో తమిళ సినిమా అయినా పర్వాలేదు అని చెప్పడంతో.. ప్రేక్షకులలో ఒక్కసారిగా ఈ విషయంపై క్యూరియాసిటీ పెరిగింది. మరి తారక్ వెట్రిమారన్ మూవీ సాధ్యమేనా.. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

ప్రస్తుతం ఎన్టీఆర్ డైరీ మరో మూడేళ్ళ వరకు ఖాళీ లేదు. ఇప్పుడు తారక్ తో కొత్త సినిమా అంటే ఎంత పెద్ద దర్శకుడైన వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం తారక్ కమిట్ అయినా సినిమాలు అంత పకడ్భందింగా ఉన్నాయి. మరి ఇలాంటి టైమ్ లో వెట్రిమారన్ మూవీ సాధ్యమేనా.. అనే సందేహాలు అందరికి మొదలయ్యాయి. నిజానికి ఎన్టీఆర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో మూవీ గురించి కొత్తగా వినిపిస్తున్నదేమి కాదు. దాదాపు కొన్నేళ్లుగా ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాంబో ఎప్పుడో సెట్ అయినా కూడా ఇప్పటికి సెట్స్ పైకి మాత్రం రాలేదు. వెట్రిమారన్ కూడా ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో తారక్ తో ఓ మూవీ ఉందనే క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు తారక్ ఉన్న బిజీకి ఈ కాంబో సెట్ అవ్వడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు కేవలం దేవర పార్ట్-1 మాత్రమే రిలీజ్ కాబోతుంది. ఇంకా దేవర పార్ట్-2 , ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ రెండో పార్ట్స్, అలాగే వార్-2 ఇలా వరుస లైన్ అప్స్ తో తారక్ చాలా బిజీగా ఉన్నారు. ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కనీసం మూడేళ్లు పడుతుంది.

అప్పటికి వెట్రిమారన్ కూడా వేరే ఏ ప్రాజెక్ట్ చేయకపోతే.. అప్పుడు ఈ కాంబోలో మూవీ ఆశించవచ్చు. అప్పటివరకు వీరిద్దరి కాంబోలో మూవీ కష్టమే. కేవలం తారక్ ప్రెస్ మీట్ లో చెప్పిన ఒక్క డైలాగ్ తో… ఇలా నిన్న మొన్నటివరకు సీన్ లో లేని వెట్రిమారన్ సడెన్ గా ట్రెండ్ అయిపోతున్నారు. సో వీరి కాంబోకి సంబంధించిన అసలు మ్యాటర్ ఇది. ఇక దేవర విషయానికొస్తే.. ఈ మూవీ ఇంకా రిలీజ్ కాకుండా అడ్వాన్స్ బుకింగ్స్ లోను రేర్ రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. దేవరోడి ఊచకోత మొదలైనట్లే.. ఇక లెక్కలు తేల్చడమే బ్యాలన్స్. మరి దేవర ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి. మరి తారక్ వెట్రిమారన్ కాంబోకి సంబంధించిన అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ