‘దేవర’ VFX కే అంత బడ్జెటా..? ఫ్యాన్స్ కూడా అసలు ఊహించలేరు!

  • Author ajaykrishna Published - 12:30 PM, Sat - 26 August 23
  • Author ajaykrishna Published - 12:30 PM, Sat - 26 August 23
‘దేవర’ VFX కే అంత బడ్జెటా..? ఫ్యాన్స్ కూడా అసలు ఊహించలేరు!

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా.. ఆస్కార్ వరకు వెళ్లి ఓ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఓ రకంగా ఆర్ఆర్ఆర్ ని ఇండియన్ ఆడియన్స్ ఎంతగా ఆదరించారో.. అదే స్థాయిలో ఫారెన్ ఆడియన్స్.. ఫిల్మ్ మేకర్స్ సైతం ఆదరించారు. సినిమాలో ఎన్టీఆర్ నటనపై ఎంతో గొప్పగా ప్రశంసలు సైతం కురిపించడం మనం చూశాం. ఆ ఒక్క సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నుండి పూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైనప్ చేస్తున్నాడు. అందులో ముందుగా ఎన్టీఆర్ నుండి ‘దేవర’ మూవీ రాబోతుంది.

దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెంచేసింది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఎన్టీఆర్ ని దేవరగా నెక్స్ట్ లెవెల్ లో చూపించనున్నాడు కొరటాల. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్స్.. టీజర్స్ అన్ని బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు డెబ్యూ చేయబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర.. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉండగా.. దేవర సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు మేకర్స్. తాజాగా దేవర విఎఫ్ఎక్స్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. దేవర మూవీలో విఎఫ్ఎక్స్ కోసమే నిర్మాతలు దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే ట్రెండ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్ షాట్స్ ఉంటాయని ఇదివరకు కొరటాల తెలిపారు. ఆ లెక్కన పోర్ట్ నేపథ్యంతో పాటు వైల్డ్ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. మరి ఆ స్థాయి గ్రాఫిక్స్ అంటే.. మినిమమ్ అంత బడ్జెట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. మరి దేవర గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments