iDreamPost
android-app
ios-app

వీడియో : క్యాన్సర్ ‌తో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన NTR

  • Published Sep 14, 2024 | 5:50 PM Updated Updated Sep 14, 2024 | 6:12 PM

Jr NTR Talks To His Fan: ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని.. దేవర సినిమా సినిమా చూసే వరకు బ్రతికించమని ప్రాధేయ పడిన సంగతి తెలిసిందే. తాజాగా తారక్ ఈ విషయంపై స్పందించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Jr NTR Talks To His Fan: ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని.. దేవర సినిమా సినిమా చూసే వరకు బ్రతికించమని ప్రాధేయ పడిన సంగతి తెలిసిందే. తాజాగా తారక్ ఈ విషయంపై స్పందించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 14, 2024 | 5:50 PMUpdated Sep 14, 2024 | 6:12 PM
వీడియో : క్యాన్సర్ ‌తో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన NTR

దేవర సినిమా కోసం తారక్ అభిమానులలో ఏ రేంజ్ లో హైప్ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాపై ఎంత అభిమానం చూపిస్తున్నారంటే.. చనిపోయే లోపు ఓసారైన చూడాలనుకునేంతల ఉన్నారు అభిమానులు. ఇలాంటి అభిమానం కేవలం జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సొంతం అని చెప్పి తీరాల్సిందే. బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తారక్ అభిమాని కౌశిక్ కు సంబంధించిన వీడియో రీసెంట్ గా అందరూ చూసే ఉంటారు. మృత్యువుతో పోరాడుతున్న అతను దేవర సినిమా చూసి చనిపోతాను అంటూ మాట్లాడిన మాటలు అందరి హృదయాలను కదిలించాయి. చివరకు ఆ వీడియో తారక్ వరకు చేరింది. తాజాగా తారక్ కూడా ఈ విషయంపై స్పందించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేవర సినిమా చూసే వరకు తనని బ్రతికించాలంటూ వేడుకున్న వీడియో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో.. తారక్ వరకు చేరింది. దీనితో తారక్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న అభిమాని కౌశిక్ తో.. వీడియో కాల్ లో మాట్లాడారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్కసారిగా తారక్ ను చూసిన కౌశిక్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. “అసలు మిమ్మల్ని చూస్తానని అసలు అనుకోలేదన్నా”. అంటూ మురిసిపోయాడు. తారక్ కూడా “నవ్వుతూ ఉంటే బాగున్నావు” అంటూ రెస్పాండ్ అయ్యాడు. దీనితో కౌశిక్ ఆనందానికి అవధులు లేవు. “నేను మాట్లాడకపోతే ఎలా” అంటూ.. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అన్ని వివరాలు కనుక్కుని.. మానిసిక ధైర్యం చెప్పి త్వరగా కోలుకుని బయటకు వస్తావ్ అంటూ నమ్మకంగా చెప్పారు తారక్. అలాగే “సినిమాలు తర్వాత.. ముందు ధైర్యంగా బయటికి రావాలి. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి” అంటూ సూచించారు. అలాగే ఆ తర్వాత కౌశిక్ తల్లితండ్రులతో కూడా మాట్లాడి దైర్యం చెప్పారు.

ఇక ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు తారక్ అభిమానులు. ఒక రియల్ హీరోకు మాత్రమే ఇలాంటి అభిమానులు ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ విషయంపై వెంటనే రెస్పాండ్ అయినందుకు ఎన్టీఆర్ మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తో పాటు అతని అభిమానులంతా కూడా కౌశిక్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఇక దేవర విషయానికొస్తే.. ఒక్కసారి మొదటి షో పడితే ఇక ఊచకోతే. తారక్ పవర్ ప్యాక్డ్ సోలో పెరఫార్మెన్స్ చూసి చాలా కాలం అయింది కాబట్టి.. తారక్ అభిమానులకు కచ్చితంగా ఇది కనుల పండగలానే ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇవన్ని చూడాలంటే ఇంకొద్ది రోజులు ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. మరి తారక్ తన అభిమానుల పట్ల వహిస్తున్న భాద్యతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss