Vinay Kola
Jr NTR-Ram Charan: కొంతమంది అభిమానులు తమ హీరోల రికార్డులను వేరే హీరోల రికార్డులతో పోల్చుకుంటూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా దారుణంగా ఈ గొడవలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా అభివృద్ధి చెందాకా ఫ్యాన్ వార్స్ పెరిగిపోయాయనే చెప్పాలి. దారుణంగా ట్రోల్ చేసుకుంటూ చెలరేగిపోతున్నారు కొందరు అభిమానులు.
Jr NTR-Ram Charan: కొంతమంది అభిమానులు తమ హీరోల రికార్డులను వేరే హీరోల రికార్డులతో పోల్చుకుంటూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా దారుణంగా ఈ గొడవలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా అభివృద్ధి చెందాకా ఫ్యాన్ వార్స్ పెరిగిపోయాయనే చెప్పాలి. దారుణంగా ట్రోల్ చేసుకుంటూ చెలరేగిపోతున్నారు కొందరు అభిమానులు.
Vinay Kola
సినిమా ఇండస్ట్రీ అన్నాక పోటీ అనేది కామన్. ఒక హీరో సినిమా రికార్డులు సృష్టిస్తే మరొక హీరో సినిమా ఆ రికార్డులని బ్రేక్ చెయ్యడం చాలా కామన్. ఈ రికార్డుల వలన సినిమాలకు మంచి లాభాలు వస్తాయి. నిర్మాతలకు కోట్లల్లో లాభాలు వస్తాయి. ప్రేక్షకులకు మంచి వినోదం వస్తుంది. ఇండస్ట్రీ బాగుంటుంది. ఇంకా మంచి సినిమాలు వస్తాయి. కానీ కొంతమంది అభిమానులు మాత్రం తమ హీరోల రికార్డులను వేరే హీరోల రికార్డులతో పోల్చుకుంటూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఈ గొడవలు ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా దారుణంగా ఈ గొడవలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా అభివృద్ధి చెందాకా విచ్చల విడిగా ఫ్యాన్ వార్స్ పెరిగిపోయాయనే చెప్పాలి. చాలా దారుణంగా ట్రోల్ చేసుకుంటూ చెలరేగిపోతున్నారు కొందరు అభిమానులు.
ఇక నందమూరి, మెగా వార్ అనేది కొన్ని సంవత్సరాలు నడిచింది. ఇరు ఫ్యాన్స్ మధ్య వార్ ఎక్కువ కావడంతో ఆ తరువాత హీరోల్లో మార్పు వచ్చింది. ఈ గొడవలు ఆపాలని ఆ హీరోలు కలిసి మీడియా ముందుకి వచ్చారు. అభిమానులను ఫ్యాన్ వార్ ఆపాలని కోరారు. ఇలా చిరు-బాలయ్య చాలా ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా కానీ ఫ్యాన్స్ మధ్య వార్ ఆగలేదు. కానీ వీరి తరువాత తరం హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అయితే ఆ గీతని పూర్తిగా చెరిపేశారు. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే తారక్- చరణ్ అనే పరిస్థితిని తీసుకొచ్చారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఏకంగా ఇండియాని షేక్ చేసే సినిమా చేశారు. వీరిద్దరూ కలిసే ఆస్కార్ అవార్డుని తీసుకున్నారు.
గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు కూడా ఫ్యాన్ వార్స్ ఆపాలని అభిమానులని కోరారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఈ ఫ్యాన్ వార్స్ ఆపేందుకు ఒకే వేదిక మీద మమేకం అయ్యారు. ఇద్దరం సొంత అన్నదమ్ములం లాంటి వారమని మేమంతా బాగుంటాము.. మీరే గొడవలు పడకుండా ఇంకా కలిసి మెలిసి బాగుండాలని సూచించారు. ఇలా మన టాలీవుడ్ టాప్ హీరోలు సోదర భావంతో, స్నేహ భావంతో కలిసి మెలిసి జనాలకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. తెలుగు సినిమాని ఇంకా పై స్థాయికి తీసుకొని వెళ్లాలని చూస్తున్నారు.
కొంతమంది ఫ్యాన్స్ బాగానే ఉన్నా కాని కొంతమంది మాత్రం ఏమాత్రం మారట్లేదు. కేవలం ఫ్యాన్ వార్ దగ్గరే ఆగిపోయారు. ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకుంటూ చాలా దారుణంగా తయారయ్యారు. వాళ్ళ సినిమాని వీళ్ళు, వీళ్ళ సినిమాని వాళ్ళు తెగ ట్రోల్ చేసుకుంటున్నారు. నిజానికి దేవర సినిమాని ట్రోల్ చేస్తే యన్టీఆర్ కి నష్టమా? ఆయన లైఫ్ ఏమైనా తలకిందులు అయిపోద్దా? గేమ్ ఛేంజర్ సినిమా పోస్టర్ బాగాలేదు అంటే చరణ్ కి ఏమైనా.. నష్టమా? ఇక ఆయన లైఫ్ లేకుండా పోద్దా? మన హీరోలు.. తమ కష్టాన్ని నమ్ముకుని బాగానే ఉంటారు. కానీ..ఇలాంటి వార్స్ వల్ల నష్టపోయేది మన సినిమా ఇండస్ట్రీ, మన నిర్మాతలు, మన డిస్ట్రిబ్యూటర్స్. ఇలాంటి వాళ్ళ అభిమానం ఇండస్ట్రీకి శాపంగా మారుతుంది.
ప్రస్తుతం మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఎన్నో నాణ్యమైన సినిమాలు వస్తున్నాయి. ఇక మీదట కూడా రాబోతున్నాయి. మన సినిమాలకు పెట్టుబడి అనేది వందల కోట్లకి వెళ్లిపోయింది. మన ఫ్యాన్ వార్స్ వలన ఏమాత్రం తేడా వచ్చినా కానీ నిర్మాతల జీవితాలు తలకిందులు అయిపోతాయి. సినిమాని సినిమా లాగా చూద్దాం. అందరి హీరోలని గౌరవిద్దాం. మన సినిమాని మనమే బ్యాడ్ చేసుకోవద్దు. మన హీరోలే కలసిపోయి.. బావ.. బావ.. అని పిలుచుకుంటూ ఉంటే, ఫ్యాన్స్ కి దేనికి ఈ గొడవలు.. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఇండస్ట్రీ బాగుంటేనే.. ఏ హీరో అయినా, ఏ ఫ్యాన్ అయినా బాగుంటారు. ఇప్పటికైనా మారండి.