iDreamPost
android-app
ios-app

Devara: దేవర ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Devara Movie Pre Release- Break Even Target: దేవర సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతా ఇప్పుడు దేవర గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవర మూవీకి అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో చూద్దాం.

Devara Movie Pre Release- Break Even Target: దేవర సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతా ఇప్పుడు దేవర గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవర మూవీకి అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో చూద్దాం.

Devara: దేవర ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఎక్కడ చూసినా దేవర సినిమా హడావుడే కనిపిస్తోంది. ఎన్టీఆర్ సహా మొత్తం చిత్ర బృందం పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఒక్క ఇండియాలోనే కాకుండా.. దేవర అమెరికాలో కూడా అడుగుపెట్టబోతున్నాడు. పక్కా ప్రణాళికలతో ఆడియన్స్ లో దేవర హైప్ పెంచేస్తున్నారు. ఒకవైపు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి అల్లాడించేశారు. మరోవైపు స్టార్స్ తో ఇంటర్వ్యూస్, మీడియా ఇంటరాక్షన్స్ తో దేవర టీమ్ ప్రమోషన్స్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తోంది. ఇప్పటికే ఇండియా సహా అమెరికాలో కూడా దేవర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే.. దేవర స్టామినా ఏంటో? ఎన్టీఆర్ ముందున్న టార్గెట్ ఏంతో తెలుస్తుంది. ఈ గణాంకాలు చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మూవీలో విషయం ఉండబట్టే ఈ స్థాయి బిజినెస్ జరిగింది అంటున్నారు. అసలు దేవర ప్రీ రిలీజ్ కి ఎంత బిజినెస్ జరిగిందో చూద్దాం.

ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న దేవర సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రీ రిలీజ్ లెక్కలు చూస్తే తెలుస్తుంది. దానికి తగినట్లుగా దేవర టీమ్ కూడా పావులు కదుపుతోంది. రెట్టించిన ఉత్సాహంతో ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. అయితే ఎన్టీఆర్ ముందు ఉన్న టార్గెట్ చిన్నదైతే కాదు అని చెప్పాలి. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ లెక్కలు చూస్తే వందల కోట్లు కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దేవర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. వరల్డ్ వైడ్ గా దేవర సినిమాకి రూ.180 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సినిమా ముందు కొండంత టార్గెట్ ఉందనే చెప్పాలి. కానీ, దేవర ప్రీ రిలీజ్ లెక్కలకు సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంత బిజినెస్ జరిగింది అంటే సినిమా అంత అద్భుతంగా ఉంది అని చెబుతున్నారు. రిలీజ్ కి ముందే దేవర బ్లాక్ బస్టర్ అయిపోయింది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.

ప్రాంతాల వారీగా దేవర సినిమాకి ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో అంచనాలు చూద్దాం. నైజాం ప్రాంతంలో దేవరకు రూ.45 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటున్నారు. విశాఖలో రూ.12 కోట్ల 50 లక్షలు, ఈస్ట్ లో రూ.8 కోట్లు, వెస్ట్ లో రూ.6 కోట్లు, కృష్ణాలో రూ.7 కోట్లు, గుంటూరులో రూ.8 కోట్ల 50 లక్షలు, నెల్లూరులో రూ.4 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ.22 కోట్లు కలిపి.. మొత్తంగా ఏపీ- తెలంగాణ ప్రాంతాల్లో దేవర సినిమాకి రూ.113 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటున్నారు. అలాగే కర్ణాటకలో రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, హిందీ బెల్ట్ లో రూ.15 కోట్లు, ఓవర్సీస్ లో రూ.26 కోట్లు, పబ్లిసిటీకి రూ.4.5 కోట్లుగా చెబుతున్నారు. అంటే మొత్తంగా దేవర సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.180 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని తెలుస్తోంది.

దేవర మూవీకి సంబంధించి రూ.180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే.. ఆ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంత చిన్నదేం కాదు. ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ ఇది సాధ్యం కాదు. బ్రేక్ ఈవెన్ కోసం రూ.400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే బిగ్గెస్ట్ టార్గెట్ అనే చెప్పాలి. కానీ, ఈ బాధ్యతను ఎన్టీఆర్ భుజానికి ఎత్తుకున్నాడు. ప్రమోషన్స్ లో కూడా అన్నీ తానై సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్నాడు. ఆ కష్టానికి తగిన ఫలితం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. కామన్ ఆడియన్స్ కూడా ఇప్పుడు దేవర సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.

కలెక్షన్స్ పరంగా ఏపీ- తెలంగాణ రాష్ట్రాల గురించి అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 12AMకి, 1AMకి, ఎర్లీ మార్నింగ్ కి కూడా చాలా వరకు స్పెషల్ షోస్ కన్ఫామ్ అయిపోయాయి. అలాగే టికెట్ హైక్ కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు పర్మీషన్ ఇచ్చేశాయి. నైజాం సర్కిల్ లో మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.413కి, సింగిల్ స్క్రీన్స్ లో రూ.250కి పెంచారు. అలాగే ఏపీలో మల్టీప్లెక్సుల్లో రూ.325, సింగిల్ స్క్రీన్స్ లో రూ.200కు టికెట్ ధరలను పెంచారు. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ విషయంలో ఢోకా లేదు. అలాగే అటు అమెరికాలో కూడా దేవర హవా కొనసాగుతోంది. అమెరికాలో కూడా ప్రమోషన్స్ ఉన్న నేపథ్యంలో రిలీజ్ కి ముందే రికార్డులు తిరగరాసేందుకు దేవర ఉవ్విళ్లూరుతున్నాడు. మరి.. దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.