iDreamPost
android-app
ios-app

Jr. NTR: 10 ఏళ్ల తర్వాత సేమ్ సీన్! తారక్ సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

  • Published Aug 12, 2024 | 12:50 PM Updated Updated Aug 12, 2024 | 12:50 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి సేమ్ సీన్ 10 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతోంది. ఈసారి కూడా ఆ సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి సేమ్ సీన్ 10 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతోంది. ఈసారి కూడా ఆ సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 12, 2024 | 12:50 PMUpdated Aug 12, 2024 | 12:50 PM
Jr. NTR: 10 ఏళ్ల తర్వాత సేమ్ సీన్! తారక్ సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’, వార్ 2 చేస్తున్నాడు. వీటితో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(వర్కింగ్ టైటిల్), దేవర పార్ట్ 2 సినిమాలు చేయాల్సి ఉంది. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ 2026 జనవరి 9న విడుదల అవుతుందని మేకర్స్ పూజా కార్యక్రమం రోజే ప్రకటించారు. దాంతో దశాబ్దకాలం తర్వాత మళ్లీ తారక్ ఇలా రాబోతున్నాడు. మరి ఆ సక్సెస్ సెంటిమెంట్ ను ఈ మూవీ ద్వారా మరోసారి రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సంక్రాంతి.. టాలీవుడ్ కు సినిమా పండగ. ఈ ఫెస్టివల్ కు సినిమా తీసుకురావాలని స్టార్ హీరోలు, బడా ప్రొడ్యూసర్లు భావిస్తుంటారు. ఎందుకంటే? ఈ పండక్కి మూవీస్ చూడ్డానికి ప్రేక్షకలు ఇష్టపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా విలేజ్ ల్లో ఎక్కువ. అందుకే మేకర్స్ ఈ పండగని టార్గెట్ గా చేసుకుని విడుదల తేదీలను ప్రకటిస్తుంటారు. ఇక అందుకు తగ్గట్లుగానే షూటింగ్స్ కంప్లీట్ చేసి, సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసి.. హిట్స్ కొడుతుంటారు. అదీకాక కొందరి హీరోలకు ఈ ఫెస్టివల్ చాలా బాగా అచ్చొస్తుంది. ఈ టైమ్ లో రిలీజ్ చేస్తే చాటు.. హిట్ ఖాయం అనే హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

Will Tarak's success sentiment be repeated

ఇదిలా ఉండగా.. ప్రశాంత్ నీల్ సినిమాతో దశాబ్దకాలం తర్వాత మళ్లీ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడు. తారక్ 2016లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీతో సంక్రాంతి పండక్కి వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీతో 2026 సంక్రాంతికి రానున్నాడు తారక్. పదేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్ కానుంది. అయితే నాన్నకు ప్రేమతో సినిమాలాగే ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ టేకింగ్ కు యంగ్ టైగర్ యాక్టింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కావాల్సిందే అంటున్నారు అభిమానులు. మరి దశాబ్దకాలం తర్వాత మళ్లీ సంక్రాంతికి తారక్ బరిలోకి దిగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet